చరణ్ జెన్యూనిటీయే అతడికి ట్రోల్స్ నుంచి శ్రీరామ రక్ష..

నిన్న భోపాల్ లో జరిగిన “పెద్ది” ప్రీరిలీజ్ ఈవెంట్లో చరణ్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాను పట్టుకొని ఫుట్ బాల్ ప్లేయర్ అనడం, అలాగే.. భోపాల్ ఆడియన్స్ ని బీహార్ అనడం వంటివి సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా బుమ్రా విషయంలో జరిగిన నెలకొన్న కన్ఫ్యూజన్ కి చరణ్ అపాలజీ ట్వీట్ కూడా పోస్ట్ చేశాడు. నిహంగానే పేర్ల విషయంలో కన్ఫ్యూజ్ అయ్యాయని దయచేసి మన్నించమని చరణ్ సదరు ట్వీట్ అర్థం.

అయితే.. నిన్న ఈవెంట్లో చరణ్ వల్ల దొర్లిన ఈ రెండు తప్పుల్ని ఇటు సోషల్ మీడియా కానీ, అటు జనరల్ ఆడియన్స్ కానీ సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే.. చరణ్ పేర్ల విషయంలో కన్ఫ్యూజ్ అవుతాడని అందరికీ తెలిసిన విషయం గనుక. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ టైంలో చరణ్ కి నేమ్స్ విషయంలో ఉన్న మతిమరుపు గురించి ఎన్టీఆర్ వివరించిన విధానం, కొన్ని ఇంటర్వ్యూల్లో చరణ్ హోస్ట్ పేరు సైతం మర్చిపోవడం వంటి సందర్భాలు చాలా చూసాం. అందుకే నిన్న చరణ్ భోపాల్ ని బీహార్ అన్నా.. బుమ్రాని ఫుట్ బాల్ ప్లేయర్ అన్నా.. ఎవరూ సీరియస్ గా తీసుకోని ట్రోల్ చేయలేదు.

ADVERTISEMENT

ఇదే వేరే హీరో ఎవరైనా ఇలాంటి తప్పు చేసి ఉంటే సోషల్ మీడియా మొత్తం ఓ రేంజ్ లో ఆడుకొనేది. గతంలో వైష్ణవి చైతన్య భీమవరం ఈవెంట్ లో రాజమండ్రి అన్నప్పుడు జరిగిన గోల తెలిసిందే. పాపం ఆ అమ్మాయిని ఆడేసుకున్నారు. అలాగే.. గద్దర్ అవార్డ్స్ స్టేజ్ మీద బాలయ్య తెలంగాణ డిప్యూటీ సీయం పేరు గుర్తు తెచ్చుకోవడానికి పడిన కష్టం కూడా ట్రోల్ మెటీరియల్ అయిపోయింది. అలాంటిది చరణ్ పేర్ల విషయంలో మతిమరుపు అనేది ఒక జెన్యూన్ మిస్టేక్ గానే చూశారు తప్ప.. అది అతను కావాలని చేసిన తప్పుగా ఎవరూ భావించలేదు. సో, చరణ్ జెన్యూనిటీయే అతడ్ని ట్రోల్స్ నుండి కాపాడింది. కాకపోతే.. కొన్నాళ్లపాటు మీమ్ పేజెస్ లో మాత్రం గట్టిగానే కనిపిస్తాడు.

Share
Dheeraj Babu

With over 13 years of experience in the film industry, Dheeraj Babu is a seasoned film journalist and critic known for insightful analysis and a keen eye for cinematic detail. He combines a deep knowledge of film hist…

Published by

Recent Posts

Toxic Washout Overseas: Fairy Tale Turns into Scary Tale?

Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…

3 hours ago

Dulquer’s Plot Leaked Before Release: BMS Responsible?

Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…

3 hours ago