
టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ స్పీకర్స్ లో ఒకరు ఎస్.కే.ఎన్. పాత్రికేయుడిగా కెరీర్ ఆరంభించి, నిర్మాతగా అతడు ఎదిగిన తీరు చాలామందికి స్ఫూర్తి. మెగా కాంపౌండ్ తరుపున ఫ్యాన్ వార్స్ చేసే స్థాయి నుండి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరుకున్న ఎస్.కే.ఎన్ ప్రయాణం ప్రశంసనీయం.
ఏ ఈవెంట్ అయినా ప్రాసలతో, పంచులతో ఎస్.కే.ఎన్ మాట్లాడే తీరుకి అభిమానులున్నారు. మీమ్ కంటెంట్ ఇవ్వడంలోనూ ఎస్.కే.ఎన్ సిద్ధహస్తుడు. బండ్ల గణేష్ తర్వాత స్పీచులతో హల్ చల్ చేసిన ఏకైక వ్యక్తి ఎస్.కే.ఎన్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
స్టేజెక్కితే పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ ఎస్.కే.ఎన్ ఇచ్చే స్పీచులకి హీరోలు సైతం అవాక్కవ్వడం చాలాసార్లు చూసే ఉంటాం.
మరీ ముఖ్యంగా ఈ ఏడాది రాజాసాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో “పండగ పండగ ప్రభాస్ పండగ.. పండగ పండగ రాజా సాబ్ పండగ” అంటూ ఎస్కేయన్ ఇచ్చిన స్పీచు మాములుగా వైరల్ అవ్వలేదు. అయితే.. సినిమా రిలీజయ్యాక ఆ స్పీచ్ తాలుకు ట్రోల్స్ అన్నీ ఓపిగ్గా భరించాడు కూడా.
కట్ చేస్తే.. ఎస్కేయన్ నిర్మిస్తున్న కొత్త సినిమా “చెన్నై లవ్ స్టోరీ” చిత్రంలోని మొదటి పాట లాంచ్ ఈవెంట్ లో అతడి స్పీచ్ మరీ చప్పగా ఉండడం గమనార్హం అయ్యింది.
వేరే హీరోల, ప్రొడ్యూసర్ల ఈవెంట్లలోనే రచ్చ చేసే ఎస్కేయన్, తన సొంత సినిమా ఈవెంట్ లో అంత సైలెంట్ గా, సింపుల్ గా, ఎలాంటి అతికి పోకుండా దాదాపు 20 నిమిషాలు మాట్లాడాడు. అంతా బాగానే అయిపోయింది అనుకుంటున్న తరుణంలో.. “పెద్ది” పోస్ట్ పోన్ న్యూస్ ను అనవసరంగా అఫీషియల్ గా అనౌన్స్ చేసి భంగపడ్డాడు.
అందుకు క్షమాపణ కోరుతూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు కానీ.. మెగా ఫ్యాన్స్ మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. మరి ఎస్కేయన్ మీద రాజాసాబ్ ఎఫెక్ట్ పడిందా?
లేక అనవసరంగా స్పీచులతో హైలైట్ అవ్వడం ఎందుకు అనుకున్నాడా? అనేది తెలియదు కానీ.. ఎస్కేయన్ నీ ఇంత సైలెంట్ గా మాత్రం చూడలేకపోయారు చాలామంది.
Don 3 was in the headlines a few months ago after Ranveer Singh left the…
The District Consumer Disputes Redressal Commission-II, Hyderabad, has held PVR Cinemas and PVR Inox Ltd.…