Telugu

గాఢ నిద్ర నటిస్తున్న టాలీవుడ్..!

బయపెట్టేవాడికే సమాజం తలవంచుతుంది అనే తీరుగానే ఉన్నాయి ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు. సామాన్యుడేకాదు రీల్ హీరోలుగా చెలామణి అయ్యే స్టార్స్ కూడా ఇదే మెతక వైఖరి అనుసరించడం కాస్త విస్మయానికి గురిచేస్తుంది అనడంలో ఎటువంటి సందేహంలేదు.

బయపడ్డారో.., బయపెడుతున్నారో.., మనకెందుకులే అని నిద్ర నటిస్తున్నారో తెలియదు కానీ రాఘవేంద్ర రావు., నట్టి కుమార్ మినహాయిస్తే యావత్ తెలుగు సినీ పరిశ్రమ నుండి కనీస స్పందన కూడా కరువైంది బాబుకి.

ADVERTISEMENT

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుండి బాబు ఎంతటి చేయూత నందించారో సినీ పరిశ్రమ పెద్దలకు తెలియంది కాదు. సినీ పరిశ్రమ మద్దతుతో టీడీపీ పార్టీలో అలుముకున్న నిశ్శబ్దం రెప్పపాటులో ఏమి కనుమరుగైపోదు. కానీ బాబు ఇటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు పవన్ సినిమాలో డైలాగ్ ఒకటి జ్ఞప్తికి రాక మానదు.

“సాయం చేసిన వాడు కృతజ్ఞత అడగడం తప్పైతే.., సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించక పోవడం మోసం” అవుతుంది. అయితే చంద్రబాబు కుటుంబసభ్యులెవరు ఎవరి ఓదార్పునొ కోరుకోవడంలేదు. కానీ ఇటువంటి సమయంలో కూడా బాబు వద్ద సాయం పొందిన పెద్దలు మౌనం వహించడం న్యాయం కాదు అంటున్నారు సినీ నిర్మాత నట్టికుమార్.

చంద్రబాబు సినీ ఇండస్ట్రీకి చేసిన మేలు గుర్తుంచుకోవాలని, సినీరంగానికి చెందిన వ్యక్తులకు ఆయన ఇచ్చిన గౌరవ – మర్యాదలను, విలువను మరువరాదని నట్టికుమార్ వ్యాఖ్యానించారు. ఏపీ కలల రాజధాని అయిన అమరావతి రూపకల్పనలో తెలుగు దిగ్గజ దర్శకుడైనా రాజమౌళి సలహాలు, డిజైన్స్ తీసుకుని సినీ ఇండస్ట్రీ వారిని కూడా ఈ నిర్మాణంలో భాగస్వాములను చేసారు అప్పటి ముఖ్యమంత్రి బాబు. అది సినీ ఇండస్ట్రీకి బాబు ఇచ్చిన మర్యాద.

చంద్రబాబు ప్రభుత్వంలో బాహాటంగానే స్టేజి పైనే ప్రభుత్వాన్ని విమర్శలు చేసిన అగ్ర హీరోలు ఇప్పుడు బాబు కోసం కాకపోయినా కనీసం ఆఇండస్ట్రీ సమస్యల పైన కూడా నోరెత్తలేని పరిస్థితిలో ఉన్నారు. తమ తోటి నటులైనా రజనీకాంత్ ను వైసీపీ నాయకులు ఇష్టానుసారం విమర్శించినప్పుడు కానీ ., తెలుగు ఇండస్ట్రీ పెద్దగా భావించే చిరుని కొడాలి నాని నోటికొచ్చినట్టు మాట్లాడినా., పవన్ కుటుంబంలోని పిల్లలను సైతం వదిలిపెట్టకుండా అసభ్యం గా మాట్లాడినా కానీ నోరు తెరవలేని దీన స్థితిలో తెలుగు సినీ పరిశ్రమ నిలబడింది అనడంలో ఏమాత్రం సంశయం అవసరం లేదు.

సినిమాలలో మాదిరి ఇక్కడ యాక్షన్ సన్నివేశాలు చేయాలని., బారిబారి డైలాగులు చెప్పాలనో ఎవ్వరు కోరుకోరు. మీరు ఈస్థాయిలో ఉన్నారు అంటే అందులో సగ భాగం ఏపీ ప్రజల వాటా తప్పకుండా ఉంటుంది. రాష్ట్రము ఇలా రాజధాని లేక., పెట్టుబడులు రాక., అల్లర్లు అరాచకాలకు అడ్డాగా మారుతుంటే తమవంతు బాధ్యతగా స్పందించి ఉంటె గౌరవప్రదంగా ఉండేది అని ఏపీ ప్రజల మనోగతం. వ్యక్తుల కోసం కాకపోయినా వ్యవస్థల మీద గౌరవంతో అయినా సినీ పరిశ్రమ మేలుకోవాలని ఆశిద్దాం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Flying Cars On Roads In 2Yrs? Elon Giving New Hopes!

Elon Musk has become the first person in history to reach a trillion-dollar net worth,…

2 minutes ago

Ramayana and Varanasi: A Battle of Grandeur

The Ramayana teaser has given audiences an idea of the scale Namit Malhotra is planning…

32 minutes ago