Telugu

AI పాట… గుర్తు తెచ్చేలా ఉండాలి… గుచ్చుకునేలా కాదు!

రవితేజ-శ్రిలీల జంటగా ‘ధమాకా’ తర్వాత వస్తున్న మరో మాస్ మసాలా సినిమా — ‘మాస్ జాతర’. భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీకి సంబంధించిన మొదటి పాట ‘తూ మేరా యార్’ అనే సాంగ్‌ను విడుదల చేశారు.

ఈ పాటకు స్పెషల్ టచ్ ఏంటంటే — అందరికి ఇష్టమైన చక్రి గారి స్వరాన్ని AI సాయంతో తిరిగి తీసుకొచ్చారు. రవితేజ-చక్రి కాంబినేషన్‌లో వచ్చిన మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే వంటి సినిమాల్లోని పాటలు ఇప్పటికీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి.

ADVERTISEMENT

‘ఇడియట్’ సినిమాలో ‘చూపుల్లో గుచ్చా గుచ్చా చంపకే’ వంటి పాట స్పెషాలిటీని భీమ్స్ సిసిరోలియో మళ్లీ ఈ చిత్రంలో పట్టుకొచ్చారు. చక్రి గారి వాయిస్ వినగానే రవితేజ సినిమాల గోల్డెన్ రోజులు గుర్తుకు వచ్చాయి. ఈ ప్రయత్నం ఖచ్చితంగా మెచ్చుకోదగినదే అయినా, AIతో వచ్చిన ఈ వాయిస్‌లో చక్రి గారి అసలైన భావజాలం పూర్తిగా లేదనిపిస్తోంది. అభిమానులకు ఈ వాయిస్ వినడం ఒక ఎమోషనల్ మూమెంట్ అయినా, ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తోంది.

రవితేజ సినిమాల్లో మాస్ సాంగ్స్ అంటే ఎనర్జీకి కొదవుండదు. ‘ధమాకా’ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణం భీమ్స్ మ్యూజిక్ మరియు శ్రిలీల డ్యాన్స్ స్పెషల్ మూమెంట్స్. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్ వస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తోడుగా చక్రి గారి వాయిస్‌ని మళ్లీ తీసుకొచ్చి, ‘చూపుల్లో గుచ్చా గుచ్చా చంపకే’ లాంటి బీట్ ఉపయోగించడమే ఆకర్షణగా మారింది.

కానీ, ఈ పాట అంచనాలకు న్యాయం చేయలేకపోయింది. సినిమా సందర్భంలో ఈ పాట రవితేజ-శ్రిలీలకి బాగుంటుందని అనిపించొచ్చు కానీ, దీని గురించి ఎక్కువగా మాట్లాడుకునేంత ప్రత్యేకత ఏమీ లేదు.

చక్రి గారి లాంటి గొంతును మళ్లీ ఉపయోగించేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది.

చాలాచోట్ల ఈ వాయిస్ ఆర్టిఫిషియల్ ఫీల్ ఇస్తోంది. కళాకారుడికి మనం ఇచ్చే గౌరవం పాటల ద్వారా గుర్తుండేలా ఉండాలి. AI ఇప్పుడు కొత్త ఒరవడిని సృష్టిస్తున్నా, ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది.

రేపటికి లెజెండ్స్ అయిన బాలు గారు, ఘంటసాల గారి గాత్రం కూడా AI రూపంలో మళ్లీ వినిపించే అవకాశాలు ఉన్నా, అవి కేవలం కమర్షియల్ సక్సెస్ కోసం కాకుండా కళాకారుడికి గౌరవం ఇచ్చేలా వాడితే బాగుంటుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు.. ఊహించిందే

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు…

1 minute ago

Egilivaranga From Bhogi: A Soulful, Lively Folk Song

Sharwa is coming up with the rural period action drama Bhogi. Directed by Sampath Nandi…

18 minutes ago