
ఆ కారణంగానే అది రెండువిదాల బ్రతికిపోయింది. ఒకవేళ కేసీఆర్ ఆదరించకపోయినా లేదా ఏపీకి తరలివచ్చేసినా దాని పరిస్థితి ఏవిదంగా ఉండేదో ఊహించుకోవచ్చు. హైదరాబాద్లో ఉండిపోవడం వలన నేడు వందల కోట్లు పెట్టుబడితో అంతర్జాతీయస్థాయి సినిమాలు తీయగలిగే స్థితికి చేరుకొంది. అదే ఏపీకి తరలివచ్చేసి ఉంటే నేడు వైసీపీ నేతల గుప్పెట్లో చిక్కుకొని విలవిలలాడుతుండేది.
అయినప్పటికీ తెలుగు సినీ పరిశ్రమతో వైసీపీ ప్రభుత్వం ఆడుకొంటూనే ఉంది. చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులను సిఎం జగన్ ఇంటికి రప్పించుకొని వారిచేత చేతులు జోడించి వేడుకొనేలా చేయడం ఇందుకు ఓ నిదర్శనం. తెలుగు ప్రజల కీర్తిప్రతిష్టలను దేశవిదేశాలకు వ్యాపింపజేస్తున్న తెలుగు సినీ పరిశ్రమని గౌరవించి ఆదరిచాల్సిన వైసీపీ ప్రభుత్వం ఎందుకు దానిని ద్వేషిస్తోంది?అంటే సమాధానం అందరికీ తెలుసు.
సినీ పరిశ్రమలో సగం మంది జనసేనకు, మిగిలినవారిలో చాలామంది టిడిపికి మద్దతు ఇస్తుండటమే. అయితే వారు అధికారంలో ఉన్న తమని కాదని ప్రతిపక్షపార్టీలకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు?అని వైసీపీ నేతలు ఒక్కసారి ఆలోచించి ఉంటే వారికే సమాధానం దొరికి ఉండేది.
కానీ వైసీపీ నేతల తీరు ఎన్నటికీ మారదని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి నిరూపించుకొంటున్నారు. “సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది.”
“సినిమాటోగ్రాఫ్ బిల్లుపై పార్లమెంట్లో మాట్లాడితే కోట్లకు పడగెత్తిన కొందరు హీరోలు భుజాలు తడుముకుంటారు ఎందుకో మరి! సినిమా పైరసీని అరికట్టడం ఎంత అవసరమో, సినీ కార్మికుల సంక్షేమం, సినీ పరిశ్రమలో పనిచేసే మహిళల భద్రత కూడా అంతే ముఖ్యం. ఉన్నమాటంటే ఉలుకెందుకు?”
ఆయన వీటితో సినీ పరిశ్రమపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటిస్తూనే, సినీ పరిశ్రమకు మూలస్తంభాలైన హీరోలని ప్రజలకు దోషులుగా చూపాలని ప్రయత్నించారు. వారు ప్రతిపక్షాలకు మద్దతు ఇస్తుండటమే కారణం.
నిన్నమొన్నటి వరకు చిరంజీవి మావాడే అని చెప్పుకొన్న వైసీపీ నేతలే ఇప్పుడు ఆయనను తిట్టిపోస్తున్నారు. ఎందుకంటే తమ ప్రభుత్వ పనితీరుని ఆయన ప్రశ్నించారు కనుక. పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నారని అర్దమవుతూనే ఉంది. అయితే “నా మూడు పెళ్ళిళ్ళ గురించి కాదు మూడు రాజధానుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు?” అని పవన్ కళ్యాణ్ ప్రశ్నకు వైసీపీ నేతల దగ్గర సమాధానం ఉండదు.
ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలు, చివరికి తెలుగు సినీ పరిశ్రమ కూడా రాకపోవడానికి ఈ రాజకీయ వేధింపులే కారణం అని చెప్పక తప్పదు. అయితే అందుకు వైసీపీ నేతలెవరూ బాధపడకపోవడమే విస్మయం కలిగిస్తుంది.
చిత్రం: రణబాలి M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: అక్టోబర్ 16, 2026 తారాగణం: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న,…
Keerthy Suresh hasn’t had the best run at the box office lately. Her recent films…