
అనకాపల్లి సమీపంలో ఆర్సలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం కూడా లైన్ క్లియర్ చేసింది. కనుక ఈ నెల 14న భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించబోతోంది. రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఆర్సలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది.
మొదటి దశలోనే ఏడాదికి 82 లక్షల తన్నులు చివరి దశ విస్తరణ పనులు పూర్తయిన తర్వాత ఏడాదికి 2.40 కోట్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్ధ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న వాటిలో ఇదే అతిపెద్ద ప్లాంట్. దీనిలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఉక్కు ఉత్పత్తి చేస్తారు.
దీనికి అవసరమైన ముడి సరకు దిగుమతులు, దీనిలో ఉత్పత్తి అయిన ఉక్కు ఎగుమతుల కొరకు అనకాపల్లి సమీపంలోనే ఓ భారీ ప్రైవేట్ పోర్ట్ కూడా నిర్మించబోతున్నాయి. కనుక ఈ ప్లాంట్, పోర్టు ద్వారా సుమారు 40 వేలకు పైగా కార్మికులు, ఇంజనీర్లు తదితరులకు ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.
ఆర్సలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ జరుగబోతుంటే దానికి కూతవేటు దూరంలోనే ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తెర వెనుక ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. కనుక ఉద్యోగులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
కానీ అధికార, ప్రతిపక్షాలు వారికి ఏమీ కాదని భరోసా ఇస్తూనే ఉన్నాయి. కనుక నాడు రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు, ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను భ్రమ పెడుతూ చివరికి హ్యాండ్ ఇచ్చేసినట్లే, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ప్రైవేటీకరణ విషయంలో కూడా మభ్య పెట్టే ప్రయత్నం చేయడం సబబు కాదు.
ఆర్సలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కి ఎలాగూ అనుభవం కలిగిన కార్మికులు, ఇంజనీర్లను నియమించుకోక తప్పదు. కనుక వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ప్రైవేటీకరణతో రోడ్డున పడబోయే కార్మికులందరినీ లేదా ఆసక్తి కలిగినవారందరినీ ఆర్సలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలిస్తే కనీసం వారికి న్యాయం చేసినట్లవుతుంది కదా?
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…