
చైనా మినహాయించి, అంతకు ముందు వరకు దాదాపుగా 790 కోట్లు వసూలు చేసింది అమీర్ ఖాన్ “దంగల్.” తాజాగా చైనా కలెక్షన్స్ ను కూడా లెక్కిస్తే… 1900 కోట్లు పైన వసూలు చేసింది. అంటే 2000 కోట్లు పూర్తి చేయాలంటే ఇంకా దాదాపుగా 100 కోట్లు అవసరముంటుంది. అయితే చైనా మార్కెట్ లో కూడా ఈ సినిమా కలెక్షన్స్ చివరి దశకు చేరుకున్నాయి. దీంతో 2000 కోట్లు సాధించే దిశగా అడుగులు వేస్తుందా? లేదా? అని ట్రేడ్ పండితులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఒకవేళ ‘దంగల్’కు ఛాన్స్ మిస్సయితే, త్వరలో చైనాలో విడుదల కాబోయే ‘బాహుబలి 2’ ఈ ఫీట్ ను అందుకుంటుందన్న అంచనాలలో సినీ అభిమానులు ఉన్నారు. ఇప్పటివరకు దాదాపుగా 1600 కోట్లు అందుకున్న ‘బాహుబలి 2’ చైనాలో ఓ 400 కోట్లు సాధించినా, 2000 కోట్ల క్లబ్ లో చేరిపోతుంది. ‘దంగల్’ సినిమాకు లభించిన ఆదరణతో, రాజమౌళి టీం కూడా చైనా మార్కెట్ పై భారీ అంచనాలను పెట్టుకుంది. ఇండియన్ మూవీ లవర్స్ ను ఊరిస్తున్న 2000 కోట్ల క్లబ్ లో చేరే మొదటి సినిమా ఏదవుతుందో…?
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…