
గంటా అరగంటా కబుర్లు చెప్పమంటే అనర్గళంగా చెప్పగలం… కావాలంటే కోడి-గుడ్డు కధలు చెప్పగలం… ఇంకా అవసరమైతే రోడ్లపై డాన్సులు చేసి ప్రజలను అలరించగలం… కానీ పరిశ్రమలు, ఐటి కంపెనీలు తెప్పించాలి… వాటి కోసం దేశాలు పట్టి తిరుగుతూ తడబడకుండా ఇంగ్లీషులో మాట్లాడాలి… అంటేనే చాలా కష్టం!
మద్యం వ్యాపారాలు, కల్తీ మద్యంపై మాక్కూడా మంచి పట్టు, అనుభవం ఉంది. కనుక ఈ సబ్జెక్ట్ గురించిఎంతసేపైనా అనర్గళంగా మాట్లాడగలం. అలాగే మాక్కూడా మెడికల్ కాలేజీల వ్యాపారాలున్నాయి కనుక వాటి గురించి కూడా మాట్లాడగలం… అవసరమైతే పోరాటాలు చేయగలం.
టమోటాలు, ఉల్లిపాయలు, కోడిగుడ్లు వేసి రోజూ మా ఇళ్ళలో కూర చేస్తూనే ఉంటారు. ఇంట్లో మామిడికాయలతో ఊరగాయలు పెడతారు… మేమూ మామిడిపళ్ళు తింటాము. కనుక వీటన్నిటిపై కూడా మాకు మంచి పట్టుంది. కనుక అవసరమైతే వీటి గిట్టుబాటు ధరల గురించి అనర్గళంగా మాట్లాడగలం… అవసరమైతే రోడ్లపై పారబోసి తొక్కుకుపోగలం.
కానీ టెక్నాలజీ మాకు కొరకరాని కొయ్యలా మారిందని ఒప్పుకుంటాం. అప్పటికీ ఎలాగో కష్టపడి ఈ మద్యనే ‘క్యూఆర్ కోడ్’ తర్వాత ‘డిజిటల్ బుక్’ వరకు అప్‌డేట్ అయ్యాము కానీ అది పెద్దగా వర్కవుట్ కాలేదు. అది వేరే విషయం.
కానీ ఈ చంద్రబాబున్నాడే… మాకు అర్ధం కాని మాటలు మాట్లాడుతూ తికమకపెట్టేస్తున్నాడు. గడీకి డ్రోన్ సిటీ అంటాడు… గడీకి ఏఐ అంటాడు… గడీకి క్వాంటం అంటాడు… ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎప్పుడైనా విన్నామా?లేదే!
ఇప్పుడేమో విశాఖలో గూగుల్ అంటున్నాడు. అయినా ఇంటర్నెట్‌లో గూగుల్ ఉండగా మళ్ళీ విశాఖలో గూగుల్ దేనికంటే సమాధానం చెప్పడు. నవ్వుతూ ‘మీకర్ధం కాదులే’ అని తప్పించుకుంటున్నాడు. ఆ నవ్వు చూస్తే మా కడుపు మండిపోతుంది.
సరే ఆయనేదో తిమ్మిని బమ్మి చేసి జనాలకు మాయ మాటలు చెప్పి మళ్ళీ ఎన్నికలలో గెలిచేయాలని ఆశతో గూగుల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ అంటూ ఏవో కబుర్లు చెపుతుంటాడు. కానీ అంత పెద్ద కంపెనీ నడిపిస్తున్న ఈ సుందర్ పిచాయ్‌కైనా తెలిసి ఉండాలి కదా?
కానీ ఆయన కూడా ఇంటర్నెట్‌లో ఉన్న గూగుల్ విశాఖలో పెడితే చాలు… విశాఖ రూపురేఖలే మారిపోతాయని తెగ అబద్దాలు చెప్పేస్తున్నాడు!
పైగా ఆయన కూడా ఈ చంద్రబాబుకి వంత పాడుతూ ఈ దశాబ్దం ఏఐదే… క్వాంటం టెక్నాలజీదే అంటూ అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడుతున్నాడు. బహుశః అలా మాట్లాడమని ఈ చంద్రబాబే ఆయనకు చెప్పి ఉంటాడు!
పండిత పుత్రులమైన మేము ఈ మాత్రం కూడా అర్ధం చేసుకోలేమనుకున్నాడు ఈ చంద్రబాబు. ఆయన క్వాంటం అంటే ఏమిటో చెప్పకపోతే మేము తెలుసుకోలేమా? అది తప్పకుండా సూర్యాకాంతం మనుమరాలే అయ్యుంటుంది. ఒకవేళ ఆమె కూతురు కాకపోయినా గూగుల్లోనే వెతికి తెలుసుకోగల జ్ఞానం మాకూ ఉంది.
ఏది ఏమైనప్పటికీ గూగుల్, మైక్రోసాఫ్ట్ లేదా మరోటి ఒక్క విషయం తెలుసుకోవడం చాలా మంచిది. కడవంత గుమ్మడికాయ కత్తి పీటకు లోకువే అన్నట్లు రేపు మేమే వస్తాము. కనుక ఎగేసుకొని ఏపీకి వచ్చే ముందు ఇది గుర్తుంచుకుంటే మంచిది. ఆనక మమ్మల్ని నిందిస్తే బాగోదు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీలో నిర్వహించిన ‘పైలట్ ప్రాజెక్ట్’ విజయవంతమైందని భావించిన సీజేపీ.. ఇప్పుడు కేంద్ర…
Poonam Kaur has once again brought Trivikram Srinivas into the conversation, but this time she…