
రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా సినిమా విడుదలైన అన్ని భాషలలోనూ అదే జోరు అదే హోరును చూపిస్తుంది ఆర్ఆర్ఆర్. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ల మీద జక్కన్న పెట్టిన శ్రద్ధ.,విడుదలైన రెండు వారాల తరువాత కూడా ప్రేక్షకుడికి సినిమా మీద ఆసక్తి తగ్గకుండా రాజమౌళి తీసుకుంటున్న జాగ్రత్తలు ప్రశంసనీయం అంటున్నారు సినీ ఇండస్ట్రీ పెద్దలు.
విడుదలైన రెండు వారాలలోనే 1000కోట్ల వసూళ్లను సొంతం చేసుకుని ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లోనే కాదు కలెక్షన్ లోను రికార్డ్స్ ని తిరగ రాస్తూ ముందుకుపోతుంది. దేశీయ మీడియాలే కాదు అమెరికా మీడియా కూడా ఈ సినిమా పట్ల సానుకూలంగా స్పందించారు. న్యూయార్క్ టైమ్స్ తమ సినిమాను ప్రశంసిస్తూ కధనాలు రాయడం రాజమౌళి తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
ఒక సినిమా విజయానికి రాజమౌళి పడుతున్న శ్రమ “నభూతో న భవిష్యతి” అన్నట్లుగా సాగుతుంది. ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత ప్రేక్షకుడికి ఒక సినిమా పై అంతటి ఆతృతను కలుగచేసినది “కేజీఎఫ్” మూవీనే. సౌత్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న తరుణంలో ఇప్పుడు అందరి దృష్టి కేజీఎఫ్ మీద పడింది. కేజీఎఫ్ చాప్టర్1 అంచనాలు లేకుండా వచ్చి ఇండస్ట్రీ రికార్డులను., ప్రేక్షకుడి మైండ్ ను కొల్లగొట్టింది.
ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న కేజీఎఫ్ చాప్టర్2 భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమైంది. చాప్టర్1లో ప్రేక్షకుడికి ఒక లెవల్ ఎంటర్టైన్మెంట్ ని రుచి చూపించిన దర్శకుడు ప్రశాంత్ నీల్., చాప్టర్2 తో అభిమానుల అంచనాలు ఆకాశానికి ఎగిరేలా చేసారు. . దానికి తోడు ఆర్ఆర్ఆర్ మూవీ సృష్టించిన ప్రభంజనంతో అభిమానుల అంచనాలు తగ్గేదేలే అన్నట్లుంది.
మూవీ రిలీజ్ అయినా తరువాత మాట్లాడే కలెక్షన్ల సంగతి అట్లుంచితే., ప్రమోషన్లో మాత్రం రాజమౌళిని మ్యాచ్ చేయలేకపోతున్నారు ప్రశాంత్ నీల్. సినిమా విడుదలకు 20రోజుల ముందు నుంచి ప్రేక్షకుడి అటెన్షన్ ను గ్రాఫ్ చేశారు జక్కన్న. విడుదలకు వారం రోజుల ముందు ‘ఇడా కాదు ఆడా’ కాదు అన్నట్లు ఎక్కడ చూసినా ‘ఆర్ఆర్ఆర్’ బ్రాండ్ తో దర్శినమిచ్చిన ముగ్గురు ‘ఆర్ఆర్ఆర్’ లు.
అయితే కేజీఎఫ్ సినిమా యూనిట్ మాత్రం విడుదలకు వారం రోజులే మిగిలుండగా ఇంకా ప్రమోషన్ లో వేగాన్ని అందుకో లేకపోతుంది. సినిమాలో నటించడానికే కాదు సినిమాను ప్రమోట్ చేయడానికి కూడా హీరోలను తన దారిలోకి తెచ్చుకోగల నైజం జక్కన్న సొంతం. చూడాలి మరి ప్రశాంత్ నీల్ ఈ విలువైన సమయాన్ని తన సినిమాకు ఏవిధంగా వాడుకోగలరో అంటూ ఆసక్తిగా గమనిస్తున్నారు అటు ట్రేడ్ వర్గీయులు.,ఇటు మూవీ లవర్స్.
The Andhra Pradesh State Election Commission has announced the schedule for MPTC and ZPTC elections,…
Ramayana has crossed $820K in overseas advance bookings, and now the focus shifts to India.…