
తాజాగా ఐపీఎల్ 2025 కోసం ఈ సంవత్సరం చివరిలో నిర్వహించనున్న మెగా ఆక్షన్ యొక్క వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. గత కొన్ని రోజుల నుండి రోజూ అభిమానులను ఊరట పెట్టించే వార్త ఎదో ఒక్కటైనా ఈ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది . మొదట ధోని రిటైర్మెంట్ అంటూ మొదలయిన ఈ వార్తలు, చివరికి హిట్-మ్యాన్ ముంబై ను వీడి ఆక్షన్ లో పాల్గొనబోతున్నారు అంటూ వార్తలొస్తున్నాయి.
రెండు రోజుల కిందటే ముంబై కు చెందిన భారత టి-20 సారధి సూర్య కుమార్ మరియు భారత వన్ డే, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఒక ఆసక్తికరమైన వార్త పుకార్లు పుట్టుకుంది. ఈ ఏడు ఐపీఎల్ విజేతలు కోల్కతా తమ కెప్టెన్ అయ్యర్ స్థానంలో సూర్య ను సారధి గా తెస్తున్నారు అని,పైగా రోహిత్ కోసం ఢిల్లీ మరియు లక్నో జట్లు ఏకంగా 50 కోట్లు తమ పర్స్ నుండి రోహిత్ కోసమని పక్కనపెట్టారంటూ వచ్చిన ఈ వార్తలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
అయితే వైరల్ అయిన ఈ రెండు వార్తలూ నిజం అయ్యే అవకాశాలు చాలా తక్కువ అంటూ పండితులు సెలవిస్తున్నారు. కప్పు తెచ్చిపెట్టిన కెప్టెన్ ను కాదని ఏ ఫ్రాంచైజీ ముందుకెళ్లకపోవచ్చు, అలాగే కేవలం ఒక్క ఆటగాడికి 50 కోట్లు పెట్టడమనేది కలలో కూడా అసాధ్యమే అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉన్నా, ఇటీవలే పంజాబ్ కింగ్స్ డైరెక్టర్ “సంజయ్ బంగార్” అన్న మాటలను మాత్రం అందరూ ఒప్పుకుని తీరాల్సిందే.
ఒక పోడ్-కాస్ట్ కు హాజరయిన సంజయ్ ను విలేఖరి-“రోహిత్ ఆక్షన్ లో కి వస్తే, కొనుగోలు చేయటం లో మీ పాత్ర ఉంటుందా?” అని అడగగా, సంజయ్ ఇలా బదులిచ్చారు-“రోహిత్ ను ప్రస్తుతం కొనుగోలు చేయటం అంత సులువు కాదు, తాను ఐపీఎల్ ఆక్షన్ చరిత్ర లో నే అత్యధిక ధర పలకవచ్చు, ఆ సమయానికి మా బడ్జెట్ బట్టి చూస్తాం, కానీ అతనిని మేము కొనుగోలు చేయలేమనే అనుకుంటున్నాను” అని అన్నారు సంజయ్. ఈ మాటల్లో భారత సారధి రోహిత్ కు నేడు ఉన్న డిమాండ్ ఏంటో తెలుస్తుంది.
ప్రస్తుతం రోహిత్,తన కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నారు. 2023 వరల్డ్కప్, 2024 టి-20 వరల్డ్కప్ లో తన ప్రాముఖ్యత ఏంటన్నది నిరూపించుకున్నారు. ఇక మొదటి బంతి నుండే దూకుడు శైలి తో ఆడుతూ, ప్రత్యర్థి బౌలర్స్ పై ఒత్తిడి పెంచుతున్నారు. అలాగే, తన కెప్టెన్సీ అనుభవాన్ని సైతం చక్కగా వినియోగిస్తూ, భారత జట్టుకు టి-20 వరల్డ్ కప్ ను అందజేశారు. ఒకవేళ తాను ముంబై ను వీడితే,అదే అనుభవం కొత్తగా వెళ్లే జట్టు కు కూడా ఉపయోగపడుతుంది.
మరి హిట్-మ్యాన్ ఆక్షన్ లో కి వస్తే పాత రికార్డ్స్ అన్ని చెల్లా చెదురవుతాయ్ అంటూ ఫాన్స్ ధీమా వ్యక్తపరుస్తుండగా, రోహిత్ శర్మ వంటి ఆటగాడిని జట్టు నుండి బైటకు పంపకూడదని ముంబై అభిమానులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి, హిట్-మ్యాన్ ఆక్షన్ లో కి వస్తే,”హిట్-మ్యాన్ కోసం ఫ్రాంచైజీలన్నీ హడలెత్తే హంటింగ్” చేస్తాయనటం లో సంకోచమే లేదు. శర్మ ఆక్షన్ లో కి వస్తే,తానే ఆక్షన్ కు సెంటర్ అఫ్ అట్ట్రాక్షన్ గా మారుతారు. చూడాలి మరి, రోహిత్ ఆక్షన్ లో కి వస్తే తాను పలికే ధర ఏంతనేది..?
YS Jagan has been very successful when it comes to mitigating the legal and judicial…
Actor Suriya has a message for students who spend too much time making reels, focus…