Telugu

సూర్య పరిస్తతి ఏంటి..?

ఇటీవలే భారత్ వేదికగా జరిగిన టి-20 వరల్డ్ కప్ ట్రోఫీ ను కైవసం చేసుకున్న ప్రస్తుత భారత టి-20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు జట్టులో కెప్టెన్సీ హోదా తొలగించనున్నారంటూ ఇవాళ ఉదయం నుండి అనేక పెద్ద సంస్థలు రిపోర్ట్స్ విడుదల చేస్తున్నారు.

మార్చ్ నెలలో ముగిసిన ఈ టోర్నీ ను కైవసం చేసుకున్న తరువాత సూర్య మీడియా తో మాట్లాడుతూ ‘నేను ఎక్కడికి వెళ్లట్లేదు, 2028 టి-20 వరల్డ్ మరియు ఒలింపిక్స్ నా లక్ష్యం’ అంటూ ఉద్దేశించటంతో సూర్య కు ఇప్పట్లో రిటైర్మెంట్ ప్లాన్స్ లేవని స్పష్టమయింది.

ADVERTISEMENT

కానీ ప్రస్తుతం సూర్య ఫామ్ చూస్తున్నట్లయితే 2028 వరుకు అతడు టి-20 సెట్ అప్ లో కొనసాగటం కష్టమనే మాటే వినిపిస్తుంది. ఇందుకు అతని ప్రస్తుత ఫామ్ తో పాటు 2028 అక్టోబర్ లో జరిగే టి-20 వరల్డ్ కప్ మొదలయ్యే నాటికి సూర్య వయసు 38 గా ఉండనుంది.

దీనితో, కేవలం అతడి ఫామ్ పైనే కాక, ఫిట్నెస్ పై కూడా అనేక అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే, బీసీసీఐ ప్రస్తుతం ఇన్ని అనుమానాల మధ్య కెప్టెన్సీ పగ్గాలను సూర్య నుండి వేరే ఆటగాడికి ఇవ్వాలనే ఆలోచనలో పడ్డట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

కానీ, ఇటీవల వచ్చిన రిపోర్టులలో టీం ఇండియా కొత్త టి-20 కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ రంగంలోకి దిగనున్నాడనే ప్రచారం జరుగుతుంది. 2024 లో కోల్కతా జట్టుకు సుమారు దశాబ్దం తరువాత ఐపీఎల్ ట్రోఫీ అందించాడు ఇతడు. 2025 లో పంజాబ్ కు కెప్టెన్ గా మారిన తొలి సీజన్లోనే దశాబ్ద కాలం తరువాత ఆ జట్టును ప్లే-ఆఫ్స్ కు పట్టుకెళ్ళాడు.

అయ్యర్ అదే ఫామ్ ను 2026 ఐపీఎల్ లో ను కొనసాగిస్తూ పంజాబ్ కింగ్స్ జట్టును ముందుండి నడిపిస్తూ ఏకంగా 7 మ్యాచ్లు ఓటమి ఎరుగకుండా జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ఐపీఎల్ ర్యాంకుల పట్టికలో పంజాబ్ ని మొదటి స్థానంలో ఉంచాడు.

ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కెప్టెన్ మరియు బ్యాటర్ కు జట్టులో చోటు లేదా అని అభిమానులు గత నెల రోజులుగా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. దీనితో సూర్య స్థానంలో శ్రేయాస్ అయ్యర్ పేరు బలంగా వినిపిస్తుంది.

అయితే ప్రస్తుత వైస్-కెప్టెన్ అక్షర్ ఐపీఎల్ కెప్టెన్సీ అనుకున్న స్థాయిలో లేకపోవటం, బుమ్రా మరియు పాండ్య వంటి ప్లేయర్స్ కు తరచుగా ఫిట్నెస్ ఇబ్బందులు రావటం వంటి కారణాన వీరికి కెప్టెన్సీ పదవి ని అందించలలేదు బోర్డు యాజమాన్యం.

అయితే ఇప్పుడు అందరు అడిగే ప్రశ్న ఏంటంటే.. జట్టులో సూర్య కు కెప్టెన్సీ లేనపుడు జట్టులో అతడి ఫ్యూచర్ గురించే. ప్రస్తుతం సూర్య ఫామ్ చూసుకున్నట్టయితే గత 2 ఏళ్లగా సూర్య బ్యాటింగ్ లో నిలకడ పూర్తిగా మిస్ అవుతుంది.

ఇదే తరుణంలో బోర్డు అతన్ని జట్టు నుండి పక్కన పెట్టే అవకాశాలు లేకపోలేవు. మరి ఇదంతా జరగకూడదు అంటే సూర్య ప్రస్తుత ఐపీఎల్ లో తిరిగి ఫామ్ అందుకుని జవాబు చెప్పాలి. మరి సూర్య తిరిగి ఫామ్ అందుకోగలడా..?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Lokesh Kanagaraj’s Next as Hero: Bold Choice or Big Risk?

Following the commercial success of Psycho in 2020, director Mysskin completed the shooting for his…

8 minutes ago

Drishyam 3 vs Haiwaan: No Fake Claims, Pure Box Office

Drishyam: The Conclusion has been a big box-office success. Trade experts can't predict exactly where…

29 minutes ago