Telugu

పవన్ సినిమాల సందడిలో వారాహి ప్రభావం తగ్గుతుందా?

జనసేన ఎప్పుడు పెట్టినా, గత ఎన్నికల్లో ఓడిపోయినా 2024లో పవన్ కళ్యాణ్ రాజకీయ అడుగులు ఆంధ్రప్రదేశ్ ప్రస్థానంలో చాలా కీలకం కాబోతున్న మాట వాస్తవం. వారాహి యాత్రలో ప్రసంగిస్తున్న తీరు, యువతను ఆకట్టుకునేలా జగన్ సర్కారుని ఎండగడుతున్న వైనం సామాన్య ప్రజలకు సులభంగా చేరుకుంటోంది.

ఆవేశం పాలు కొంత ఎక్కువే అనిపిస్తున్నా ఆ మాత్రం లేనిదే జనానికి సులభంగా అర్థం కాని పరిస్థితి నెలకొంది. స్పందన పట్ల కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు. స్పీచుల తాలూకు వీడియోలతో ఆన్ లైన్ లో సందడి చేస్తున్నారు. ఈ పరిణామాలు బాగున్నాయి కానీ పవన్ కొత్త సినిమాల అప్ డేట్లతో అభిమానులు తిరిగి వాటి వ్యామోహంలో పడి తాత్కాలికంగా అయినా జనసేన నుంచి దృష్టి పక్కకు మరలిస్తారేమోననే అనుమానంలో లాజిక్ ఉంది.

ADVERTISEMENT

ఎందుకంటే తమ హీరో కొత్త చిత్రం కన్నా కిక్ ఇచ్చేది ఫ్యాన్స్ కి మరొకటి ఉండదు. ఏదైనా దాని తర్వాతే. బ్రో ప్రమోషన్లు మొదలుపెట్టారు. కొద్దిరోజులు విపరీతమైన శ్రమతో ఖద్దరు ప్యాంటు చొక్కా వేసుకున్న పవన్ రూపం ఇంకా మదిలో ఉండగానే బీడీ వెలిగించుకుని పంచె కట్టుకున్న స్టిల్ వదిలి హఠాత్తుగా ఫోకస్ ని మార్చేశారు.

నిన్నటి దాకా జనసేన ప్రణాళిక ఎలా ఉంటుంది, తర్వాతి ఊళ్ళలో పవన్ ఎలా మాట్లాడతాడనే ఆలోచనల స్థానంలో బ్రోలో తన గెటప్ ఏ పాటలో ఉంటుంది, తేజుతో కలిసి ఎలాంటి స్టెప్పులు వేశాడు, ఫైట్లు ఎన్ని పెట్టారు లాంటి అప్డేట్స్ సగటు ఫ్యాన్ మెదడుని ఆక్రమించుకుంటాయి. జూలైలో రిలీజ్ అయ్యే వరకు బ్రో పబ్లిసిటీ జరుగుతూనే ఉంటుంది

కాబట్టి ఇదంతా నిత్య వ్యవహారంగా మారుతుంది. మధ్యలో ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు తాలూకు కబుర్లతో అభిమానుల బుర్ర బిజీగానే ఉంటుంది. పార్టీ నడిపేందుకు, అవసరమైన వాళ్లకు సహాయం చేసేందుకు సినిమాలు చేస్తున్న పవన్ ఉద్దేశాన్ని ఫ్యాన్స్ పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్లే ఈ చిక్కంతా. మొదటి రోజు బ్యానర్లు కట్టినోళ్లు టికెట్లు కొన్నోళ్లు అందరూ జనసేనకు ఓటేయాలంటే ఈ స్ట్రాటజీ సరిపోదు.

అలా అని ప్రమోషన్లు ఆపాలని కాదు. దానికి సరైన టైమింగ్, గ్యాప్ రెండూ చూసుకోవాలి. యాత్రకు బ్రేక్ ఇచ్చాడు కదాని వెంటనే టీజర్లు, పాటలు వదిలితే వాటి మైకంలో పడి వారాహిలో పవన్ చెప్పిన మాటలు పబ్లిక్ మర్చిపోతారు. ఈ విషయంలో తగినంత జాగ్రత్త తీసుకుంటే తప్ప మళ్ళీ ఈ సీన్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే నిర్మాతకు మార్కెటింగ్ కావాలి కానీ పవన్ రాజకీయ ప్రమోషన్ కాదుగా. పైవన్నీ చూసుకోవాల్సింది పవనే.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Kappi Squad Review: Average but Watchable Urban Comedy

BOTTOM LINE Average but Watchable Urban Comedy PLATFORM JioHotstar RUNTIME 1 Hour 73 Mins (4…

4 minutes ago

King 100: Nagarjuna’s Strong Take on Pan India

Nagarjuna’s upcoming film King 100 is currently planned as a Telugu film and not a…

19 minutes ago