‘లిటిల్ మాస్టర్’ బిగ్గెస్ట్ రికార్డు ను ‘కింగ్’ అందుకోగలడా..?

1983 వరల్డ్ కప్ లో అండర్-డాగ్స్ గా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఏకంగా ట్రోఫీ నే ఇంటికి తెచ్చే పాటికీ, భారత దేశం లో క్రికెట్ ఒక మతం లా మారిపోయింది. ఆ మతం లో ఎందరో దేవతలూ, వారందరికీ ఒక దేవుడు గా భారత్ లో ఇప్పటికి ‘లిటిల్ మాస్టర్’ అంటూ “సచిన్ టెండూల్కర్”ను ముద్దుగా యావత్ భారత దేశం పిలుచుకుంటుంది. అలాంటి సచిన్ పేరిట ఉన్న అతి పెద్ద రికార్డు “100 – 100’s”. అయితే, సచిన్ తెచ్చిన ఆ క్రేజ్ ను కొండంత ఎత్తులో పెట్టాడు కింగ్ “విరాట్ కోహ్లీ”.

ఇప్పటికే విరాట్, సచిన్ పేరిట ఉన్న ఎన్నో రికార్డులను తన ఖాతా లో వేసుకుని, సచిన్ వారసుడిగా తన స్థాయి ను క్రమక్రమంగా పెంచుకున్నాడు. అయితే, 2023 వరల్డ్ కప్ లో విరాట్,సచిన్ పేరిట వన్ డే ఫార్మాట్లో ఉన్న అతి పెద్ద రికార్డు- “వన్ డెల్లో అత్యధిక శతకాలు”ను తన ఖాతా లో వేసుకున్నాడు. వన్ డెల్లో 49 శతకాలతో ఎవ్వరికి అందనంత ఎత్తు లో ఉన్న సచిన్ రికార్డు ను తాను అందుకుని,ఆ ఎత్తయిన 50 శతకాలు అనే ఎవరెస్టు శిఖరం మీద తానెక్కికుర్చున్నాడు.

ADVERTISEMENT

అయితే, విరాట్ ప్రస్తుతం తన అంతర్జాతీయ కెరీర్ లో 80 శతకాలను పూర్తిచేసాడు. ఆ 100-100ల రికార్డు కు కేవలం 20 అడుగుల దూరం లో ఉన్నాడు. ప్రపంచం లో నే సచిన్ తర్వాత అత్యధిక సంతకాలు అందుకున్న బ్యాట్సమెన్ విరాట్ కోహ్లీ. ఇప్పటికే తన వయసు 35 పై బడగా, తన ఫిట్నెస్ దృష్ట్యా తాను కచ్చితంగా మరొక 4-5 ఏళ్ళు క్రికెట్ ఆడవచ్చు. కానీ ప్రస్తుతం విరాట్ ఉన్న ఫామ్ బట్టి చుస్తే ఈ 4-5 ఏళ్లలో తాను 20 సెంచరీలు అందుకోవటం సవాళ్లతో కూడుకున్నదే అంటున్నారు క్రికెట్ అభిమానులు.

ఇప్పటికే 2020-2022 ఆగష్టు మధ్య, ఒక్క శతకం కూడా లేక కెరీర్ లో నే అత్యంత ‘లో’ ఫేస్ నుండి తాను ఒక దద్దరిల్లే కం బ్యాక్ ఇచ్చాడు. 71 ఏనాడైతే వచ్చిందో, అదే వరుసలో ఆ సంఖ్యా 80 ను చేరింది. కేవలం 2023 లో నే 8 శతకాలను నమోదు చేసి,తిరిగి సెంచరీల వేట మొదలుపెట్టాడు అనుకునే లోపే, మళ్ళీ ఒక పెద్ద బ్రేక్ వచ్చింది. 2023 నవంబర్ నుండి విరాట్ అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ చేయలేకపోయాడు.

అయితే, ఒక్కసారి తాను సెంచరీ ల గాడి లో పడితే తనకు ఆ 100 సంతకాల ఫిగర్ ను అందుకోవటానికి పెద్ద సమయమేమి పట్టకపోవచ్చు. కానీ, తాను టి-20 క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పిన కారణాన ఎక్కువ టెస్ట్ ఫార్మటు పై దృష్టి పెడితే, వచ్చే 12 నెలల గడువు లో 32 ఇన్నింగ్స్ ఆడనున్నాడు కోహ్లీ. కనుక వచ్చే సంవత్సరం లో కనీసం 6-8 సెంచరీలు తాను సాధిస్తే, ఆ పై సంవత్సరాలలో తాను సచిన్ పేరిట ఉన్న 100-100’s ను అందుకోగలడు అనటం లో అతిశయోక్తే లేదు. చూడాలి మరి వచ్చే 12 నెలల కాలం లో కోహ్లీ బ్యాటు నుండి ఎన్ని సెంచరీలు వస్తాయో అని..?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Actress Divya Bharathi Dating IPL Star? Real or Rumors?

Tamil actress Divya Bharathi, known for Bachelor and her special appearance in Maharaja, has sparked…

34 minutes ago

OTT Shocker: Theatrical Disaster Wins Great Reviews

Amit Rai’s Ohh My Dog appears to be getting a fresh lease of life on…

1 hour ago