Telugu

ట్రైలర్ టాక్ – చెప్పడానికి గానీ, చెప్పుకోవడానికి గానీ ఏం లేదు!

కమర్షియల్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్, టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన “విన్నర్” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైంది. ప్రామిసింగ్ హీరోగా మారిన సాయిధరమ్ తేజ్ మరోసారి అదే ఈజ్ ను ప్రదర్శిస్తూ ‘విన్నర్’లో కనిపించారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో ఉన్న సినిమా కధ, హీరోకు అలవాటు లేనటువంటి గుర్రపు పందాల పోటీ చుట్టూ తిరుగుతున్నట్లుగా ట్రైలర్ స్పష్టం చేసింది.

ఒక విధంగా చెప్పాలంటే ‘తమ్ముడు’ సినిమాలో బాక్సింగ్ నేర్చుకుని విలన్ పై ఎలాగైతే పవన్ కళ్యాణ్ నెగ్గాడో, అదే విధంగా ‘విన్నర్’ సినిమాలో హార్స్ రైడింగ్ నేర్చుకుని విలన్ పై సాయిధరమ్ తేజ్ ఎలా నెగ్గాడు అనేది కధ ఇతివృత్తంగా కనపడుతోంది. సాయి తర్వాత సినిమా ప్రధాన ఆకర్షణగా మారిన హీరోయిన్ రకుల్ అందాలు ఆరబోసినట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. దీంతో ఈ బ్యూటీ అందాలు ‘విన్నర్’కు మరో హైలైట్ గా మారాయి. థమన్ సంగీతం, సింగం సుజాతగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ అంతా రొటీన్ గానే ఉన్నాయి.

ADVERTISEMENT

‘జబర్దస్త్’ బ్యూటీ అనసూయ ఐటెం సాంగ్ ఈ సినిమాలో ఉన్న మరో స్పెషాలిటీ. దీనికి సంబంధించి అనసూయ ఓ డ్యాన్సింగ్ మూమెంట్ ను ట్రైలర్ లో చూపించి, ఆ హాట్ బ్యూటీ అభిమానులను అలరించే ప్రయత్నం చేసారు. మొత్తంగా చెప్పాలంటే… ఈ సినిమా ట్రైలర్ గురించి గొప్పగా చెప్పడానికి గానీ, చెప్పుకోవడానికి గానీ ఏమీ లేకపోయినా… మాస్ కమర్షియల్ ఫార్మాట్ లో రూపొందించడం పైసా వసూల్ కు పనికొచ్చే అంశం. కొత్తదనాన్ని కోరుకుంటున్న ప్రేక్షకులు ఈ ‘విన్నర్’ను గెలిపిస్తారో లేదో?!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Allu Arjun-Atlee Rift: Raaka Making the Toxic Mistake?

Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…

3 hours ago

Irumudi Director Shiva Nirvana Set to Leave Tollywood?

Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…

4 hours ago