
వైసీపీ ఓటమితో ఇన్నాళ్ళుగా ఆ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. విజయసాయి రెడ్డి రాజీనామా వైసీపీ కి ఊహించని షాక్ ఇస్తే ఇక ఆ తరువాత జరుగుతున్న పరిణామాలు వైసీపీ ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.
తాజాగా లిక్కర్ కేసులో భాగంగా సిట్ విచారణకు హాజరైన విజయసాయి మరోసారి జగన్ చుట్టూ ఉండే కొఠారి పై విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే సాయి రెడ్డి కోటరీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడానికి కోటరీ సభ్యులలో ఒకరైన సుబ్బారెడ్డి మీడియా ముందుకొచ్చారు.
వైసీపీ కోటరీ వేధింపులు తట్టుకోలేకనే తానూ వైసీపీ నుండి బయటకు రావాల్సి వచ్చిందని, అక్కడి కోటరీ పెద్దలు తన పై చేసిన అసత్యప్రచారాల వలన జగన్ కు తనకు దూరం ఏర్పడిందని, దానితో తన మనసు విరిగిపోయి పార్టీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని సాయి చేసిన కామెంట్స్,
అలాగే వైసీపీలో 2 స్థానంలో ఉన్న నన్ను పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ కోటరీ 2000 వ స్థానంలోకి తీసుకొచ్చిందంటూ విజయసాయి ఇచ్చిన స్టేట్మెంట్స్ కు సంజాయిషీ చెప్పుకోవడానికి వైవి సుబ్బారెడ్డి ముందుకొచ్చారు. పార్టీ నుండి బయటకు వెళ్ళాకా పార్టీ పై, ఇక్కడి నాయకుల పై అభాండాలు వేయడం సాయి రెడ్డి కి సమంజసం కాదు,
వైసీపీలో సాయి రెడ్డి చెపుతున్నట్టు జగన్ చుట్టూ కోటరీ ఉందా లేదా అనేది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాయి రెడ్డికి తెలియలేదా.? అసలు ఆ కోటరీని ఎవరు నడిపారో ఆయనకు తెలియదా.? మా పార్టీలో సాయి చెపుతున్నట్టు 2 వ స్థానంలో ఎవరు లేరు, ఇక పై ఉండబోరు కూడా,
వైసీపీ లో 1 నుంచి 100 వరకు కూడా అంతా జగన్ మాత్రమే అంటూ వైవి సుబ్బారెడ్డి, మాజీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కి కౌంటర్ ఇచ్చారు. అయితే వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి పరిశీలిస్తే అసలు వైసీపీలో కోటరీ ఉన్నట్టా.? లేనట్టా.? అన్న అనుమానం కలుగుతుంది. ఇన్నాళ్లు కోటరీని నడిపింది ఎవరో.? అంటూ ఒక సందర్భములో సాయి రెడ్డే కోటరీ కర్త, కర్మ, క్రియ అన్నట్టుగా వ్యాఖ్యానించారు సుబ్బారెడ్డి.
మరోసారి అసలు కోటరీనే లేదు అన్నట్టుగా నిర్దారించే ప్రయత్నం చేసారు. అయితే సాయి రెడ్డి ఒక్కరే కాదు వైసీపీ నుండి బయటకు వచ్చిన ప్రతి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నుండి పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్త స్థాయి వ్యక్తి వరకు అందరు వైసీపీ పై ఆ పార్టీ అధినేత పై చేసే విమర్శ జగన్ ను కలవాలంటే ఒక యుద్ధమే చెయ్యాలి. ఆయనతో అపాయింట్మెంట్ దొరకాలి అంటే తాడేపల్లి ప్యాలస్ గేట్ బయట కొన్ని నెలలు వేచి చూడాల్సిందే.
ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి కొట్టిపడేస్తున్నట్టు, సాయి రెడ్డి ఆరోపిస్తున్నట్టు జగన్ చుట్టూ కోటరీ ఉందా లేదా అన్నది సామాన్య ప్రజలకే కాదు సగటు వైసీపీ అభిమానికి కూడా పూర్తి స్పష్టత వచ్చినట్లయ్యింది.
Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…