Telugu

స్టార్ హీరోను హత్య చేసేందుకు కుట్ర!

ఓ కేసు విచారణలో భాగంగా బెంగళూరుకు చెందిన రౌడీ ‘సైకిల్’ రవిని విచారించిన సీసీబీ పోలీసులు విస్తుగొలిపే సమాచారాన్ని రాబట్టారు. కన్నడ స్టార్ హీరో యశ్ ను హత్య చేసేందుకు తాను కుట్రపన్నినట్టు రవి చెప్పడంతో అవాక్కవ్వడం పోలీసుల వంతయ్యింది. ఈ విషయమై బెంగళూరుకు దగ్గరలో జరిగిన ఓ మందు పార్టీలో చర్చించామని, ప్లాన్ వేశామే తప్ప, ఇంకా కార్యాచరణను ప్రారంభించలేదని చెప్పాడు.

నినీ నిర్మాత జయణ్ణతో ఓ వివాదం నేపథ్యంలో యశ్ పై సైకిల్ రవి పగను పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. యశ్ హత్యకు జరుగుతున్న కుట్ర విషయాన్ని పోలీసులు చాలా చిన్న విషయంగా చెబుతుండటం గమనార్హం. ఇది పాత కథని, ఏదో తాగిన మత్తులో వాగిన వాగుడేనని, తాము రవి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నామని ఓ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే ఈ విషయం కన్నడ ట్రేడ్ వర్గాల్లో కలకలం రేపింది.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Most Expensive Indian Films: Can Any Film Beat Ramayana?

Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…

7 minutes ago

‘Pocket Rockets’ Is Niharika’s Next!

Niharika Konidela’s production banner, Pink Elephant Pictures, has joined Maximum City Studios for Pocket Rockets,…

22 minutes ago