యష్ కూడా ప్రభాస్ తో పోల్చుకుంటే ఎలా?

కేజీఎఫ్2 తర్వాత దాదాపు 4 ఏళ్ల విరామం అనంతరం యష్ నటిస్తున్న సినిమా ఒకటి ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే టాక్సిక్, ఈ సినిమాకి అతడు హీరో మాత్రమే కాదు సహ రచయిత, సహ నిర్మాత కూడా. ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం ట్రైలర్ & ప్రమోషనల్ కంటెంట్ మంచి ఆసక్తి క్రియేట్ చేసినా.. ప్రమోషన్స్ లో మాత్రం జోరు లేదు.

ఇదే యష్ మొదటి పాన్ ఇండియన్ సినిమా కేజీఎఫ్ రిలీజ్ కి అన్ని భాషల్లోనూ ఇంటర్వ్యూలు ఇచ్చి, ఈవెంట్లు చేసి నానా హడావుడి చేశాడు. కానీ టాక్సిక్ విషయంలో మాత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఒకటి చేసి, బాలీవుడ్ లో ప్రమోట్ చేసుకుంటూ కూర్చున్నాడు.

ADVERTISEMENT

కేజీఎఫ్ కి హిందీ కలెక్షన్స్ ఎక్కువ అనే విషయం నిజమే అయినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల నుండి ఆ సినిమాలకి వచ్చిన రెవెన్యూ అనేది పట్టించుకోకపోతే ఎలా. సినిమాకి వచ్చిన 1000 కోట్లలో 130 కోట్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చినవే. అలాంటిది యష్ మాత్రం తన సినిమాని హిందీలో మాత్రమే ప్రమోట్ చేసుకుంటున్నాడు.

ప్రభాస్ అంటే నిజంగానే సిగ్గరి కాబట్టి ప్రమోషన్స్ కి దూరంగా ఉంటాడు కానీ.. మిగతావాళ్ళు అలా ఉండాలి అంటే కుదరదు. మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వకుండా, అతను ఎలాంటివాడు, అతని మైండ్ సెట్ ఎలాంటిది అనేది జనాల్లోకి ఎలా వెళ్తుంది. అందులోనూ ఇప్పుడిప్పుడే పాన్ ఇండియన్ ఆడియన్స్ కి అలవాటు అవుతున్న యష్ కూడా ఇందుకు దూరంగా ఉంటే ఎలా?

ఇలా ప్రభాస్ తో పోల్చుకుని గతంలో కొందరు హీరో మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం, ఇచ్చినా ఒకే ఒక్క రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ ఇవ్వడం లాంటివి చేశారు. ఆ సినిమాల పరిస్థితి ఏమైంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూలు ఇస్తేనే, ప్రమోషన్స్ చేస్తేనే సినిమాలు ఆడతాయా అంటే కాదు.. కానీ ఆ సినిమా కంటెంట్ ఏంటి, జానర్ ఏంటి? ఎలాంటి ఐడియాలజీ సినిమా ద్వారా చెప్పాలనుకుంటున్నారు? వంటి విషయాలు స్టార్లు మాట్లాడితేనే జనాల్లోకి వెళ్తాయి.

ప్రభాస్ కూడా సాహో, రాధేశ్యామ్ వరకు తన సినిమాలకి ప్రమోషనల్ ఈవెంట్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి, ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ విషయాన్ని మరిచి కొత్త పాన్ ఇండియా హీరోలందరూ ప్రభాస్ తో కంపేర్ చేసుకుంటే.. పులిని చూసి వాతలు పెట్టుకున్నట్లు ఉంటుంది.

Share
Dheeraj Babu

With over 13 years of experience in the film industry, Dheeraj Babu is a seasoned film journalist and critic known for insightful analysis and a keen eye for cinematic detail. He combines a deep knowledge of film hist…

Published by

Recent Posts

Series Won, Bowling Exposed? Big WC Warning for India

India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…

21 minutes ago

Singeetham Passes Away: A Farewell With Utmost Respect

Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…

34 minutes ago