ముఖ్యమంత్రి కావాలనే పట్టుదలతో వైస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి మరణానంతరం తన తండ్రి చావు ని తట్టుకోలేక ఆగిన ప్రతి గుండెను పలకరిస్తా…ప్రతి కుటుంబాన్ని ఓదారుస్తా..అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు.
జగన్ మొదలుపెట్టిన యాత్రకు జగన్ అవినీతి కేసులు బ్రేక్ వెయ్యడంతో ఆయన 16 నెలలపాటు జైలుకే పరిమితమయ్యారు. ఆ సమయంలో జగన్ ను ఓదార్చడానికి వైస్ కుటుంబం మొత్తం జైలుకెళ్లి రావాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ యాత్రను చెల్లి వైస్ షర్మిల కొనసాగించి ముగించారు.
జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర ఆయనను ముఖ్యమంత్రిని చేయలేకపోవడంతో 2019 ఎన్నికలే లక్ష్యం గా ప్రతిపక్ష పాత్ర పోషించవలసి జగన్ రోడ్డు బాట పట్టారు. ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరుతో 2017 నవంబర్ లో మొదలుపెట్టిన పాదయాత్ర 2019 జనవరిలో ముగిసింది. ఈ యాత్రతో ప్రజలకు దగ్గరైన జగన్ ఎన్నికలలో తన గెలుపుకి ఇది సరిపోతుందో లేదో అనే అనుమానంతో తన తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తో వైస్సార్ పాదయాత్రను గుర్తుచేస్తూ ఎన్నికల ముందు “యాత్ర” అనే సినిమాను ప్రజల ముందుకి తీసుకువచ్చారు.
జగన్ పాదయాత్ర కష్టమో, వైస్సార్ యాత్ర పుణ్యమో కానీ జగన్ అనుకున్నది సాధించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఎలాగూ ముఖ్యమంత్రి కావడం కోసం రెండు సార్లు యాత్రల పేరుతో ప్రజల దగ్గరకు వెళ్లాను కదా అనుకున్నారో ఏమో కానీ అధికారం రాగానే ఆయన బయటకు రాలేదు సరికదా, బయట వారిని లోపలి కూడా అనుమతించలేదు. దీనితో సరిగ్గా ఐదేళ్ల తరువాత మళ్ళీ ఎన్నికలకు రెండు నెలల ముందు యాత్ర సీక్వెల్ “యాత్ర -2 “ను రెడీ చేసారు.
ఈ నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ప్రజాక్షేత్రంలోకి వచ్చిందేలేదు, ఒకవేళ బటన్ నొక్కడానికి వచ్చినా పరదాల చాటున వచ్చి గాలిలో వెళ్ళిపోయేవారు. దీనితో ప్రజలు మరిచిపోయిన జగన్ పాదయాత్రను మరోసారి గుర్తు చేసి తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి యాత్ర -2 తో ప్రజల ముందుకు వస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. మరి ఈ యాత్ర జగన్ “వై నాట్ 175 ” కలను నిజం చేయకపోయినా కనీసం ప్రతిపక్షాలు కంటున్న కలనైనా కలగా మిగల్చగలదా అనేది ఎన్నికల ఫలితాల తరువాతనే తేలుతుంది.
యాత్ర తో మమ్ముటి వైస్సార్ పాత్ర చేసి ప్రజలను మెప్పించారు. యాత్ర -2 లో జగన్ పాత్ర పోషించడానికి తమిళ హీరో జీవను ఎంచుకున్నారు. మరి జీవ తన నటనతో జగన్ కు 2024 ఎన్నికలకు జీవం పోస్తారో లేదో..?ఇప్పటికే ఆర్జీవీ తో జగన్ పన్నిన ‘వ్యూహం’ కోర్టులో చిక్కుకుని బయటకు రాలేక ఇబ్బంది పడుతుంది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో శివ మేక నిర్మాతగా యాత్ర 2 ఫిబ్రవరి 9 న విడుదలకు సిద్దమయ్యింది.

Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…