Telugu

ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డిని అందుకోగలరా?

నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ జీవిత కధాంశం రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న అమెరికాలో చిత్రం ప్రీమియర్లు జరిగాయి. మొదటి భాగం, ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీసు వద్ద ఫెయిల్ కావడంతో ఈ సినిమా మీద కొంచెం కూడా అంచనాలు లేవు. అంచనాలు లేకపోవడం అటుంచితే అసలు ఈ సినిమా ముందే ప్లాప్ అని ఒక నిర్ణయానికి వచ్చేసారు చాలా మంది. ఆ ప్రభావం సినిమా ఓపెనింగుల మీద స్పష్టంగా కనిపించింది.

మొదటి భాగంకి వచ్చిన దాంట్లో సగం కూడా రాలేదు. అమెరికా ప్రీమియర్లకు ఎన్టీఆర్ కథానాయకుడు దాదాపుగా 450కే డాలర్లు కలెక్ట్ చేస్తే ఎన్టీఆర్ మహానాయకుడి అందులో సగం కూడా రాలేదు. $101,460 మాత్రమే రాబట్టగల్గింది. అయితే ఒకానొక దశలో ఈ చిత్రానికి ఉన్న బ్యాడ్ టాక్ వల్ల ఆ మాత్రం కూడా రాదు అనుకున్నారు చాలా మంది. ఇప్పుడు మొత్తంగా సినిమా ఎంత రాబడుతుంది అనేది చూడాలి. ఇటీవలే విడుదలైన రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తీసిన యాత్ర కొంచెం ఇంచుమించు ఇలాగే మొదలయ్యింది.

ADVERTISEMENT

ఆ సినిమా ఫుల్ రన్ లో 225,000 డాలర్ల దాకా రాబట్టే అవకాశం ఉంది. మరి ఎన్టీఆర్ ఎలా పెర్ఫర్మ్ చేస్తుందో చూడాలి? టాక్, రివ్యూలు అయితే అంత గొప్పగా ఏమీ లేవు. చూడాలి మొత్తం మీద ఆ సినిమా ఎంత రాబడుతుంది అనేది? 225-250 అంటే తక్కువనే చెప్పుకోవాలి. ఎన్టీఆర్ మహానాయకుడు యాత్ర మీద ఎన్నో రేట్లు పెద్ద సినిమా. పైగా బాలకృష్ణ లాంటి స్టార్ హీరో, క్రిష్ లాంటి అగ్రదర్శకుడు ఉన్న సినిమా. చూడాలి ఏం జరగబోతుంది అనేది… !!!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Yash’s Ramayana Connection Is Bigger Than Ravana

Yash is preparing to face audiences as Ravana in Ramayana, but his role in the…

8 minutes ago

ఏపీ టూరిజం స్పాట్ గా సూర్యలంక బీచ్…?

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొలమానాలు అంటే ఒకటి పారిశ్రామిక ప్రగతి మరొకటి ఆర్థిక పురోగతి. అయితే అందులో రెండవదైన ఆర్థిక పురోగతికి…

25 minutes ago