
అయితే ఇప్పుడు మాత్రం మరో ఆలోచనలో పడిపోయింది. దీనికి కారణం… ఇది కాంగ్రెస్ కోణంలో వస్తుండడమే. తన జీవితకాలం మొత్తం కాంగ్రెస్‌లోనే కొనసాగిన రాజశేఖరరెడ్డి, పాదయాత్ర ద్వారా పార్టీని తిరిగి రాష్ట్రంలో గద్దెనెక్కించగలిగారు. ప్రధానంగా పాదయాత్ర చుట్టూనే తిరిగే ఈ సినిమా టీజర్ ను వైఎస్ జయంతి సందర్భంగా విడుదల చేశారు. ‘తెలుసుకోవాలని ఉంది.
కడప దాటి ప్రతి గడపకు వెళ్లాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు. ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. ఈ పాదయాత్ర నా పట్టుదలో, మూర్ఖత్వమో చరిత్రనే నిర్ణయించుకోనీ’ అనే డైలాగులతో ‘యాత్ర’ టీజర్ ఆకర్షించింది. పాదయాత్ర చుట్టూనే తిరిగే ఈ సినిమాలో ఇందులో వైఎస్ పాత్రధారి మమ్ముట్టి కాంగ్రెస్ కండువా వేసుకుని కనిపిస్తారు. ఇందులో ఏ రకంగా చూసినా వైఎస్-కాంగ్రెస్ మాత్రమే కనిపిస్తున్నాయి.
కాబట్టి వైసీపీకి వచ్చే లాభం ఏకోశానా కనిపించడం లేదు. వైసీపీకి ఇది ఇబ్బందికరంగా పరిణమించింది. ఏపీలో పూర్తిగా కునారిల్లిన కాంగ్రెస్ కు ఎంతవరకు మేలు చేస్తుందన్నది పక్కన పెడితే, కాంగ్రెస్ ను గుర్తు చేసే విధంగా మాత్రం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ‘యాత్ర’ వల్ల వైసీపీకి ఒరిగేదేమీ లేదనే టెన్షన్ మొదలైనట్లుగా టాక్. దీంతో ఈ సినిమా విషయంలో ఎలా ‘ప్రమోషన్’ చేసుకోవాలనే దానిపై వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
Varsha Rekhate is turning a sunlit tropical escape into her personal fashion runway. A punchy…
Fahadh Faasil's debut Telugu film as a lead actor, Don't Trouble the Trouble directed by…