దువ్వాడ వైరల్ స్టోరీ: సొంత మీడియాలో చోటే లేదా!

“ఇవాళ్ళ రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ న్యూస్ ఛానల్‌ చూసినా మా గురించి వార్తాలే… ఏ యూట్యూబ్‌ ఛానల్ చూసినా మా గురించి వార్తలే… మా కుటుంబం పరువు బజారున పడింది.” ఈ మాటలన్నది మరెవరో కాదు వైసీపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.

అల్లు అర్జున్‌ నటించిన దువ్వాడ జగన్నాధం సినిమా అంత సూపర్ హిట్ అయ్యింది దువ్వాడ వారి రొమాంటిక్ స్టోరీ. అందుకే అంత వైరల్ అయ్యింది.

ADVERTISEMENT

అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంతగా దువ్వాడ వారి స్టోరీ మారుమ్రోగిపోతుంటే, దాని గురించి వైసీపి సొంత మీడియాలో మాత్రం కనబడలేదు. ఆన్‌లైన్‌లో ఎడిషన్ నిండా అంబేడ్కర్ విగ్రహం, జగన్‌ భద్రత, వైసీపి కార్యకర్తలపై టిడిపి దాడులు గురించే వ్రాసుకున్నారు.

జగన్‌ అక్రమాస్తుల కేసుల గురించి సాక్షిలో వ్రాసుకోలేన్నట్లే దువ్వాడ స్టోరీని కూడా వేసుకోలేదని సరిపెట్టుకోవచ్చు. పైగా జగన్‌ సర్టిఫై చేసిన దువ్వాడ శ్రీనివాస్ పేరు ఇటువంటి వ్యవహారంలో మారుమ్రోగిపోతుండటం జగన్‌కు చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది.

కనుక అధినేతకు ఇబ్బంది, పార్టీ ప్రతిష్టకి భంగం కలిగిస్తున్నందున ఇంత వైరల్ అవుతున్న ఈ వ్యవహారానికి సొంత్ మీడియాలో చోటు లభించలేదనుకోవచ్చు. లేకుంటే ఈ పాటికి ఆయన తరపున వఖల్తా తీసుకొని ‘ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్రే’ అని తీర్మానించేసి ఉండేది.

ఏది ఏమైనప్పటికీ వైసీపి సొంత మీడియాలో ఈ స్టోరీ రాకపోవడం, ఎటువంటి వఖల్తా వాదనలు వినిపించకపోవడం చూస్తే నేడో రేపో తాడేపల్లి ప్యాలస్‌ నుంచి దువ్వాడ నివాస్‌కి పిలుపు రావడం ఖాయమే అని భావించవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Payal Makes Black Glam Look So Bold

Payal Radhakrishna makes a black dress feel anything but predictable in this striking fashion shoot.…

9 minutes ago

Shriya Saran’s Fake HOT Pics: AI Makes Your B**bs Bigger

Drishyam 3 actress Shriya Saran has opened up about being a victim of AI-morphed photos.…

23 minutes ago