
వైసీపీ నేతల దౌర్జన్యాలు, దుర్మార్గాలను ఓటమి కూడా నిలువరించలేకపోతుందా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కొంతంది వైసీపీ నాయకులు. ఓడిపోతేనే ఇంతలా రౌడీయిజం జుళిపిస్తున్న ఈ వైసీపీ నేతలు గత ఐదేళ్లు ఏ రకంగా వ్యవస్థలను, అవి నడిపే అధికారులను బెదించి ఉంటారో ఊహించుకోవచ్చు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రావు గత ఐదేళ్లు నోటికి వచ్చిన అడ్డమైన వాగుడు వాగుతూ టీడీపీ, జనసేన అధినేతల పై రెచ్చిపోయారు. కట్ చేస్తే చివరికి సొంత కుటుంబ సభ్యుల చేతనే ఛీత్కారాలు ఎదుర్కొంటు పరాయి పంచన చేరి ఇప్పటికి తానూ చేసింది న్యాయం, ధర్మం అంటూ దివ్వెల మాధురితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.
అయితే అసలు విషయానికి వస్తే, దువ్వాడ శ్రీనివాస్, గత మూడు నెలల నుంచి సుమారు 56 వేలు పై చిలుకు ఉన్న తన ఇంటి కరెంటు బిల్ కట్టకపోవడంతో సదరు లైన్ మాన్ వచ్చి దువ్వాడ ఇంటి కరెంటు సప్లై ని కట్ చేసారు. దీనితో ఆగ్రహించిన దువ్వాడ ఆ ఉద్యోగి కి ఫోన్ చేసి నువ్వు టెక్కలి లో ఎలా విధులు నిర్వహిస్తావో నేను చూస్తాను, ఎంత ధైర్యం ఉంటే నా ఇంటి కరెంటు సప్లై కట్ చేస్తావ్ అంటూ వైసీపీ బూతుల పంచాంగం ఎత్తుకున్నారు.
అయితే టెక్కలి విద్యుత్ శాఖ ఏఈ మురళీమోహన్ రావు కు ఫోన్ చేసి దువ్వాడ వాగిన చెత్త వాగుడు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనితో వీళ్లకు అధికారం పోయిన ఇంకా అహంకారం తగ్గలేదు అంటూ దువ్వాడ పై విమర్శలు కురిపిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉంటేనే ఈ విధంగా తానూ వాడుకున్న కరెంటు కు కూడా బిల్ కట్టకుండా ఇలా ప్రభుత్వ ఉద్యోగుల మీద బూతులతో రంకెలేస్తున్న దువ్వాడ అసలు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు సక్రమంగా విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించారా.? అంటూ ప్రశ్నిస్తున్నారు.
దువ్వాడ వైఖరి చూస్తుంటే ఏపీలో ఇంకా వైసీపీ ప్రభుత్వమే పాలన చేస్తుంది, తానూ ఇంకా అధికార పార్టీలోనే ఉన్నాను, నేను ఎం మాట్లాడిన పరవాలేదు అనే భావనలో ఉన్నారా అనిపిస్తుంది. తప్పు చేసి కూడా ఇలా నోరేసుకుని బతుకుతుంటే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవా.? ఒకవేళ అలా చర్యలకు ఆదేశిస్తే కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల మీద కక్ష్య సాధింపు రాజకీయాలు చేస్తుంది అంటూ అసత్య ప్రచారాలు.
The next 24 hours could be extremely consequential in Indian politics as something big is…
The elections to the Telugu Film and TV Dancers and Dance Directors Association will not…