Telugu

వైసీపీ లో ‘యువరక్తం’ అంటే వారసత్వమేనా.?

వైసీపీ పార్టీ యువతను ఆకట్టుకునే రాజకీయాలు చేస్తుందని, వైసీపీ లో యువరక్తం నిండుకుండలా కనిపిస్తుందంటూ వైసీపీ శ్రేణులు, ఆ పార్టీ మద్దతుదారులు జబ్బలు చరుచుకుంటున్నారు. అయితే అసలు వైసీపీ లో కనిపిస్తున్న ఆ యువరక్తం మొత్తం వారసత్వంతోనే నిండిపోతుంది అనే వాదన క్షేత్ర స్థాయిలో బలంగా వినిపిస్తుంది.

వైసీపీ పార్టీలో రాజకీయంగా ఎదిగేందుకు, రాజకీయంగా అవకాశం దక్కించేందుకు కూడా వారసత్వమే మూలాధారమా.? అన్న ప్రశ్న తలెత్తుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జగన్ అదే తీరుగా వారసత్వ రాజకీయాన్ని పెంచి పోషిస్తున్నారా.? అయితే రాజకీయాలలో వారసత్వం తప్పు కాదు కానీ కేవలం వారసత్వమే ప్రామాణికంగా తీసుకోవడం తప్పు.

ADVERTISEMENT

యువత అంటే కేవలం సొంత పార్టీ నాయకుల కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, అలాగే యువరక్తం అంటే వారికీ సంబందించిన రక్తసంబంధీకులు మాత్రమే లెక్కలోకి రారు అనేది వైసీపీ గ్రహించాలి. అయితే ఇప్పటికే వైసీపీ లో మొదలైన ఈ వారసత్వం రాజకీయ నాయకుల గురించి ఒక్కసారి చూద్దాం.

జగన్ మావిగాన్ లో భాగమైన మచిలీపట్టణం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని స్థానంలో ఆయన రాజకీయ వారసుడుగా పేర్ని కిట్టు,

తిరుపతి లో భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి ని రంగంలో దింపుతున్నారు,

ఇక గోదావరి జిల్లాలోని రామచంద్రపురం కేంద్రంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్య ప్రకాష్

చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

శ్రీకాకుళం జిల్లా నుంచి సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు తనయుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు

విజయనగరం జిల్లా నుంచి మరో సీనియర్ నేత బొత్స కుమార్తె బొత్స అనూష

ఇక వైసీపీ నెంబర్ గేమ్ లో ‘కీ’ పాత్ర పోషించే సజ్జల రామకృష్ణ రెడ్డి తన తనయుడు సజ్జల భార్గవ్ రెడ్డిని తెరవెనుక రాజకీయంతో రంగంలోకి దింపారు.

అలాగే పుంగనూరు నుంచి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి తన వారసుడిగా మిథున్ రెడ్డిని ఇప్పటికే వైసీపీ ఎంపీ స్థానంలో కూర్చోపెట్టారు.

ఇలా వైసీపీ పార్టీలో కొత్త తరం అంటూ పాత రాజకీయానికి కొత్త రంగు పుస్తున్నారు కానీ సామాన్య ప్రజానీకం నుంచి కొత్తగా నాయకులను తయారు చేయడం లేదు. రాజకీయాలలో ఆసక్తి కనపరిచే వారు, వైసీపీ పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసే క్యాడర్ లో ఉన్న బలమైన కార్యకర్తలను ప్రోత్సహించి వారికి రాజకీయ అవకాశలు కల్పిస్తే అది కొత్త తరం రాజకీయం అవుతుంది.

అంతే కానీ ఇలా ఒకరి తరువాత ఒకరు అనుకుంటూ అంగ బలంతోనో, ఆర్థిక బలంతోనో ఇది మా తండ్రి వారసత్వ హక్కు అంటూ ముందుకొస్తే ఇక రాజకీయం సామాన్యుడికి అందని ద్రాక్షే అవుతుంది. అటువంటి రాజకీయ విధానం ముమ్మాటికీ కొత్త తరం రాజకీయం అనిపించుకోదు.

ఇందులో వైసీపీ పార్టీ ఒక్కటే దోషి కాదు రాజకీయ పార్టీలన్నీ కూడా ఇదే రకమైన వారసత్వ రాజకీయాలను పెంచి పోషిస్తూ రాజకీయాలలో కాలానుగుణంగా రావాల్సిన కొత్త మార్పులను ఆహ్వానించలేకపోతున్నాయి.

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వరకు తనదయిన గుర్తింపు సంపాదించుకున్న నారా చంద్రబాబు నాయుడు ఇలా సామాన్యుడిగా మొదలుపెట్టి ఒక అసామాన్యుడిగా ఎదిగారు, అలాగే తనలాంటి మరెందరినో రాజకీయ నాయకులుగా మలిచారు. అయితే నేటి రాజకీయ పార్టీలలో అటువంటి రాజకీయం కానీ అటువంటి రాజకీయ నాయకులు కానీ మచ్చుకు కూడా కానరావడం లేదు అంటే అతిశయోక్తి కాదేమో..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

2027 తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చనుందా.?

రెండు తెలుగు రాష్ట్రాలలో విపక్ష పాత్రలో రాజకీయాలు సాగిస్తున్న వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలు రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఒకే…

36 minutes ago

కవిత బలాలు ఒకే…మరి బలహీనతలు…?

ప్రస్తుతం కవిత రాజకీయ బలం కల్వకుంట్ల అనే బ్రాండేనా.? లేదా గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలలో ఎంపీగా ఎమ్మెల్సీ గా…

42 minutes ago