
అయితే వీటికి తెలుగు తమ్ముళ్లు కూడా అదే స్థాయిలో రిప్లైలు ఇస్తూ సందడి చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి చెప్పిన దాంట్లో నిజముంది… చంద్రబాబు అనే వ్యక్తి నిజంగానే నథింగ్ అని, కాకపోతే అన్ని సందర్భాలలో కాదు గానీ, కొన్ని విషయాలలో మాత్రం నథింగ్ అన్నది వాస్తవమేనని టీడీపీ వర్గీయులు కూడా అంగీకరిస్తున్నారు.
అవినీతి చేయడంలో చంద్రబాబు అనే వ్యక్తి నథింగ్ అని
రాజకీయ లబ్ది కోసం తప్పుడు ప్రచారాలు చేయడంలో నథింగ్
అవినీతి, అక్రమాస్తుల కేసుల విషయంలో నథింగ్
బూతులు మాట్లాడడంలో గానీ, మాట్లాడించడంలో గానీ నథింగ్
అభివృద్ధిని అడ్డుకోవడంలో నథింగ్
ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలను గుప్పెట్లో పెట్టుకోవడంలో నథింగ్
అసెంబ్లీలో భజన చేయించుకోవడంలో నథింగ్
చెత్త పన్నులు వంటివి విధించడంలో నథింగ్
రహదారులను గుంతలు గుంతలుగా మార్చడంలో నథింగ్
మౌలిక వసతి సదుపాయాలను నిర్వీర్యం చేయడంలో నథింగ్
గొడ్డలి పోటులను గుండెపోటుగా చిత్రీకరించడంలో నథింగ్
కల్తీ సారా మరణాలను సహజ మరణాలుగా పరిగణించడంలో నథింగ్
కరెంటు కోతలను విధించడంలో నథింగ్
పరిశ్రమలను రాష్ట్రం నుండి వెళ్లగొట్టడంలో నథింగ్
కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ లో ఉంచడంలో నథింగ్
వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో నథింగ్
ఉద్యోగాలను తీసుకురాకుండా చూడడంలో నథింగ్
జీతాలు, పంపకాలు కోసం అప్పులు చేయడంలో నథింగ్
రెవిన్యూ లోటును అంతకంతకూ పెంచుకుంటూ పోవడంలో నథింగ్
రాష్ట్రాన్ని తిరోగమన దిశగా పయనించేలా చేయడంలో నథింగ్
చివరగా…
ప్రజలను సోమరిపోతులను చేసే సంక్షేమ పధకాలను పెట్టడంలో చంద్రబాబు ఈజ్ నథింగ్ అంటున్నారు. చెప్పుకోవాలే గానీ ఇంకా చాలా విషయాలు ఉంటాయి, చంద్రబాబు నథింగ్ అని చెప్పడానికి..! అన్న చందంగా సోషల్ మీడియాలో ‘చంద్రబాబు నథింగ్’ అంశం హైలైట్ అవుతోంది. ఏది ఏమైనా సీఎం గారు కూడా నిజాలు చెప్తారని చెప్పడానికి ఇదొక నిదర్శనం.
The teaser for Sunny Deol’s next, Suryaa, is out now. The movie was announced a…
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has defended the direct election of mayors and…