
ఈసారి సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు రెండు బలమైన కారణాలు కూడా ఉన్నాయి. 1. ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరుగబోయే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు. 2. రేపు ఉదయం కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు.
కనుక ఇదే సమయంలో అవినాష్ రెడ్డి కధ ప్రీ-క్లైమాక్స్కు చేరుకోవడం ‘జస్ట్ కో-ఇన్సిడెన్స్’ అని చెప్పుకొనే వెసులుబాటు వైసీపీకి ఉంది. లేదా ఈ రెండు కార్యక్రమాలు చాలా ముందుగానే నిర్ణయించబడ్డాయి కనుక ‘అదృశ్యశక్తులు’ సాయం కోసమే అవినాష్ రెడ్డి ఈ డైలీ సీరియల్ను ఈరోజు వరకు పొడిగించుకొన్నారని గిట్టనివారు చెప్పుకోవచ్చు.
కనుక ఒకవేళ నేడు తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తే, సీబీఐ ఆయనను అరెస్ట్ చేస్తుందా లేక నోటీసు పంపించి విచారణకు హాజరుకావాలంటూ మళ్ళీ ఈ డైలీ సీరియల్ కొనసాగించేందుకు ఆయనకు అవకాశం కల్పిస్తుందో చూస్తే సీబీఐ మీద ‘అదృశ్యశక్తులు’ ప్రభావం ఉందో లేదో తెలుస్తుంది.
ఈ కేసులో కొసమెరుపు ఏమిటంటే, అమాయకుడైన అవినాష్ రెడ్డిని టిడిపి ఒత్తిళ్ళకు తలొగ్గి సీబీఐ విచారణ, అరెస్ట్ పేరుతో వేధిస్తున్నందుకు ఇటు వైసీపీ, అదృశ్య శక్తుల ఒత్తిళ్ళకు తలొగ్గి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తోందంటూ అటు టిడిపి రెండూ కూడా సీబీఐనే నిందిస్తుండటం!
After Dragon, NTR is expected to join hands with Trivikram Srinivas for GOW. However, a…
Vidya Balan has revealed that missing the chance to play legendary Carnatic singer M.S. Subbulakshmi…