Telugu

ఇది ఆమె వేసిన స్కెచ్.. ఇలానే జరుగుతుంది.. అంతే.

ఎవరైనా సరే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత పదవే లక్ష్యంగా పనిచేస్తుంటారు. ఒకసారి పదవి దక్కాక దానిని కాపాడుకోవడానికి వారు పడే పాట్లు అన్ని ఇన్ని కాదు. చేతిలోకి వచ్చిన పవర్ ని ఎట్టిపరిస్థితుల్లో చేజార్చుకోకుండా ఉండటానికి విశ్వప్రయత్నాలు చేస్తారు. అలాంటి ప్రయత్నమే ఇప్పుడు జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ తతంగం అంతా ఆమే కనుసన్నల్లోనే నడుస్తుంది అనే వ్యాఖ్యలు గట్టిగానే వినబడుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు.. ఆమె వేసిన స్కెచ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం కడప, పులివెందుల రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పేర్లు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి. రాజకీయ ప్రవేశం కోసం, జిల్లాలో పట్టుసాధించడం కోసం వారు సుదీర్ఘ కాలం వేచి ఉండాల్సి వచ్చిందంట. వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి లు బ్రతికున్నంత వరకు భాస్కర్ రెడ్డి కుటుంబసభ్యులను రాజకీయంగా ఆమడదూరం పెట్టేవారని టాక్ ఉంది. అయితే వైఎస్ఆర్ మరణానంతరం అవినాష్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా బాగా ఎదిగే అవకాశం వచ్చినట్లయిందని కడప జనం చర్చించుకుంటున్న పరిస్థితి.

ADVERTISEMENT

అయితే అవినాష్ రెడ్డి కుటుంబం రాజకీయంగా ఎదగడానికి జగన్ సతీమణి భారతి నే కారణమని అంతా అంటారు. ప్రస్తుతం వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే భాస్కర్ రెడ్డి ని అరెస్ట్ చేసిన సీబీఐ, త్వరలోనే అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఒక వేళ అదే జరిగితే చేతికి చిక్కిన పవర్ చేజారిపోతుందేమో అనే భయం అవినాష్ రెడ్డి కుటుంబంలో మొదలయ్యిందనే టాక్ వినిపిస్తుంది.

ఇప్పటికే జగన్ కి షర్మిళ తో ఉన్న విబేధాలు నేపథ్యంలో షర్మిళ భర్త అనీల్ జగన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారట. ప్రస్తుతం వైసీపీ పై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత, మరో పక్క బ్రదర్ అనీల్ వ్యతిరేక ప్రచారం పార్టీకి మరింత డ్యామేజ్ చేస్తాయని ఆలోచించి షర్మిళ ని బుజ్జగించే పనిలో పడ్డారట. అందుకోసం షర్మిళకి రాయభారం కూడా పంపారట జగన్.

ఒక వేళ షర్మిళ జగన్ బుజ్జగింపులకు కరిగిపోయి, అన్నయ్యతో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటే షర్మిళ కొన్ని డిమాండ్లు జగన్ ముందు పెట్టనున్నారని తెలుస్తుంది. ఒకటి ఆస్తుల పంపకాలు అయితే, మరొకటి కడప పార్లమెంట్ టికెట్ లేదా రాజ్యసభ కు పంపడం అనేవి షర్మిళ ప్రధాన డిమాండ్లని టాక్.

ఇక షర్మిళ ని రాజ్యసభకు పంపించాల్సి వస్తే కడప పార్లమెంట్ నుండి వైఎస్ రాజారెడ్డి వారసత్వం అయిన వైఎస్ సునీల్ రెడ్డికి లేదా అదే కుటుంబం నుండి మరెవరికైనా అవకాశం ఇవ్వాలని, భాస్కర్ రెడ్డి కుటుంబసభ్యులకు ఇవ్వొద్దు అనేది షర్మిళ డిమాండ్ గా తెలుస్తుంది. వైఎస్ఆర్ ఆలోచన కూడా అదే కాబట్టి, ఆయన ఆలోచన ప్రకారమే చెయ్యాలి అనేది షర్మిళ నిర్ణయమట.

ఈ పరిస్థితిని ముందే ఊహించిన జగన్ సతీమణి భారతి, వైఎస్ భాస్కర్ రెడ్డి అన్న మనవడు అయిన అభిషేక్ రెడ్డికి రాజకీయంగా అవకాశం కల్పించాలని జగన్ తో అన్నారని సమాచారం. దాంతో వైఎస్ మదనమోహన్ రెడ్డి కుమారుడైన డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డికి సింహాద్రిపురం, లింగాల మండలాల బాధ్యతలు ఇచ్చారు జగన్. అభిషేక్ రెడ్డి ఈ రెండు మండలాలపై పట్టు సాధిస్తే పులివెందుల నియోజకవర్గ పూర్తిబాధ్యతలు అభిషేక్ రెడ్డికి అప్పగిస్తారని తెలుస్తుంది. అయితే అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేస్తే అభిషేక్ రెడ్డికి పూర్తి బాధ్యతలు దక్కనున్నాయి.

ఎప్పుడెప్పుడా అని అని ఎదురుచూసిన రాజకీయ అవకాశం వైఎస్ఆర్ మరణానంతరం వచ్చింది, ఇంతకాలానికి వచ్చిన పవర్ ని చేజార్చుకోకూడదనే భాస్కర్ రెడ్డి కుటుంబసభ్యులకే బాధ్యతలు అప్పగించేలా భారతి స్కెచ్ వేశారని కడప ప్రజానీకం కోడై కూస్తున్న పరిస్థితి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Sharmila Slams TDP and YSRCP Over Violence During AP Municipal Elections

Political tensions are rising in Andhra Pradesh as clashes continue during the municipal election nomination…

12 minutes ago

Varanasi Release in Doubt? Prabhas’ Fauzi May Benefit

SS Rajamouli's Varanasi is one of the most ambitious projects in Indian cinema, with Mahesh…

42 minutes ago