
వైఎస్ కుటుంబం మధ్య సాగుతున్న ఈ అన్నా – చెల్లి..ఓ బాబాయ్ హత్య కథ నానాటికి ముదురుతోంది. 2019 ఎన్నికలకు ముందు సాక్షిలో గుండె పోటుతో మొదలైన ఈ కథ ఇక అక్కడి నుంచి నారాసుర రక్త చరిత్రగా రూపం మార్చుకుని వైసీపీ ఎన్నికల ప్రచార అస్త్రంగా రూపుదిద్దుకుంది.
ఇక 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంతో నారాసుర రక్త చరిత్ర మరకలు కాస్త టీడీపీ నుంచి వివేకా కుమార్తె కుటుంబాన్ని తాకాయి. వివేకా దారుణ హత్య వెనుక వివేకా కుమార్తె సునీత భర్త హస్తం ఉందని, వివేకా కు ఉన్న అక్రమ సంబంధాల ఆస్తి పంపకాల వివాదంతో వివేకా పై ఈ రకమైన గొడ్డలి వేటులు పడ్డాయంటూ వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది.
అయితే వివేకా కు గుండె పోటు అంటూ సాక్షిలో కథ మొదలు పెట్టింది వైసీపీ నే, కాదు కాదు వివేకా హత్య నారాసుర రక్త చరిత్ర అంటూ ప్రచారం చేసింది వైసీపీ నే, చివరికి సొంత అల్లుడే వివేకాను అంతమొందించాడు అంటూ వాదిస్తుంది వైసీపీ నే.
అయితే వైసీపీ వినిపిస్తున్న ఈ మూడు వాదనలలో అసలు వాస్తవమే లేదంటూ వివేకా హత్యకు వైసీపీ కడప ఎంపీ సీటుకు సంబంధం ఉందంటూ వివేకా కుమార్తె సునీత నుంచి జగన్ సోదరి షర్మిల వరకు ఆరోపిస్తున్నారు. వైసీపీ కడప ఎంపీ పదవికి అవినాష్ రెడ్డి అర్హుడు కాదని, అతనికి జగన్ ఆ ఎంపీ టిక్కెట్ ఇవ్వొద్దు అన్నందుకే ఆయన పై పగపట్టి అవినాష్ ఈ దారుణానికి తెగబడ్డాడు అనేది ఈ చెల్లెళ్ళ వాదన.
వివేకా ఎప్పటికైనా తన పదవికి అడ్డే అని అవినాష్ భావించడంతో వివేకా హత్య ఇలా భిన్న వాదనలతో అటు సాక్షి లో ఇటు వైసీపీ లో ప్రచారం జరిగిందంటున్నారు ఈ అక్కా చెల్లెల్లు. ఒక్క ఎంపీ సీటు కోసం వైఎస్ కుటుంబంలో చెలరేగిన ఈ రక్తపు మరకలు ఇప్పటికి ఇరు వర్గాల మధ్య ఆరని మంటలుగానే కొనసాగుతున్నాయి.
వివేకా హత్య పట్ల అక్కా అంటూ అవినాష్ రెడ్డి ఇస్తున్న సంజాయిషీలు, తమ్ముడు కాదు అంటూ సునీత చేస్తున్న విమర్శలు, ఈ పాపంలో అన్న జగన్ కు భాగస్వామ్యం ఉందంటూ చెల్లి షర్మిల చేస్తున్న ఆరోపణలతో వైఎస్ కుటుంబం మధ్య ఉన్న రక్త సంబంధాలు కాస్త రక్తపు మరకలు గా మారుతున్నాయి.
Venkatesh Maha is returning with his next film Attahaasam. The film is set in the…
Earlier there were multiple unverified media reports about the ACB court potentially looking at impounding…