గత కోర్టు తీర్పులకు సీఎం నైతిక బాధ్యత తీసుకుంటారా మరి?

నిన్నటివరకు కోర్టులని బూతులు తిట్టేవారు ఏపీ మంత్రులు. కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఆ పార్టీ సోషల్ మీడియా సెల్ తో సమానంగా కోర్టులను దూషించి కోర్టు ధిక్కార కేసులు ఎదురుకున్నారు. కోర్టులను చంద్రబాబు మ్యానేజ్ చేస్తున్నారని… తన కులానికే చెందిన ఎన్వీ రమణ తో హైకోర్టుని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించేవారు.

అయితే తాజాగా హై కోర్టులో ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఒక తీర్పు వచ్చింది. . రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు కొట్టేసింది. వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డొస్తుందని హైకోర్టు భావించింది. ప్రజారోగ్యం ఇబ్బందుల్లో పడుతుందని, అందువల్లే ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది.

ADVERTISEMENT

ఇలా తీర్పు రాగానే మంత్రి కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి మళ్ళీ రెచ్చిపోయారు. “నిమ్మగడ్డకు కోర్టులు బుద్దిచెప్పాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు వెంటపడి కొడతారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలా కోర్టు తీర్పు. నిమ్మగడ్డ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. నిమ్మగడ్డ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి,” అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

అయితే సోషల్ మీడియాలో ప్రతిపక్షాలలో దీని మీద విసుర్లు వస్తున్నాయి. “ఒక్క కేసులో అనుకూల తీర్పు రాగానే కుక్కకాటుకు చెప్పుదెబ్బలా కోర్టు తీర్పు అంటూ విమర్శిస్తున్నారు. నిమ్మగడ్డ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అంటున్నారు సరి. మరి గతంలో వచ్చిన తీర్పులకు నైతిక బాధ్యత సీఎం జగన్ తీసుకుంటారా? లేక నాని తీసుకుంటారా?,” అని వారు ఎద్దేవా చేస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

RGV’s Police Company Starts With AI Controversy

Ram Gopal Varma has announced his new film Police Company, which is scheduled to hit…

20 minutes ago

Ranabaali: Where Exactly Vijay Deverakonda Going Wrong?

Vijay Deverakonda seems to be going through a disastrous and confusing phase in his career,…

50 minutes ago