
ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ప్రతి వేదిక మీద పత్రికల మీద విమర్శలు చేయడం, తనకు అనుకూలంగా లేని పత్రికాధిపతులను అవమానికరంగా తూలలాడడం జగన్ కు పరిపాటిగా మారిపోయింది. తానూ ఒక పత్రికాధిపతిగా ఉంటూ మరో పత్రికా కథనాల పై దిగజారుడు విమర్శలు చేస్తూ జగన్ ఈనాడు పత్రికా స్వాతంత్య్రయాన్ని నేలరాశారు.
జగన్ తన పుట్టినరోజు కానుకగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత టాబ్ ల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టారు. చింతపల్లిలో జరిగిన ఈ బహిరంగ సభ వేదికగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాల్సిన ముఖ్యమంత్రి యదావిధిగా తన పాఠం తానూ చదివి ‘ఈనాడు’ దిన పత్రికను ఉద్దేశించి “ఛీ..ఛీ..ఇది ఒక పత్రికా..దీన్ని ఎవరైన చదువుతారా ..?”అంటూ పత్రికను కింద పడేసారు.
తనను, తన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కథనాలు రాయడమే ఈనాడు చేసిన క్షమించరాని తప్పిదం అన్నట్లుగా జగన్ భవిష్యత్ తరాల రాజకీయ నాయకుల తల రాతలు మార్చే విద్యార్థుల ముందు ఒక జర్నలిజం విలువలను కాలరాస్తూ విద్యార్థులకు ఇచ్చే సందేశం ఇదేనా..?అంటూ తోటి జర్నలిస్టు సోదరులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను తప్పుబట్టడం ప్రజాస్వామ్యంలో ఒక భాగం అనే విషయాన్ని జగన్ ఎప్పటికప్పుడు మరిచిపోతూ పత్రికా స్వాతంత్య్రం పై ఆంక్షలు పెట్టడం దుశ్చర్యే అవుతుంది అంటున్నారు పలువురు సీనియర్ జర్నలిస్టులు.
అసలు జగన్ కు ఇంత కోపం తెప్పించేంతలా ఈనాడు రాసిన కథనం విషయానికి వస్తే..,విద్యార్థుల చేతులో టాబ్లు ఉంటే వాటిని సద్వినియోగం చేసుకునే వారి శాతం కన్నా దుర్వినియోగం చేసే వారి సంఖ్యే ఎక్కవ అనేది ఈ పత్రికా కథనం సారాంశం.ఈ అభిప్రాయమే జగన్ కు పేపర్ కింద పడేసేంత కోపం తెప్పించింది. నిజంగా చెప్పాలంటే ఇది ఒక్క ఈనాడు పత్రికా అభిప్రాయం మాత్రమే కాదు. నేటి తరం విద్యార్థుల తల్లిదండ్రులలో మెజారిటీ వర్గం దీనికి ఆమోదం తెలిపిన మాట వాస్తవం.అయితే ఇప్పుడు ఆ తల్లిదండ్రులందరిని జగన్ అవమానించినట్లేనా..?
151 ఎమ్మెల్యే లతో ప్రజా మద్దతుతో గెలిచిన పార్టీని, ఏర్పడిన ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు, పత్రికలు సద్విమర్శ చేసిన ప్రజా తీర్పుని మీరు అవమానిస్తారా…? అంటూ సహించలేని వైకాపా నాయకులు మరి ఈనాడు పత్రికా సర్కులేషన్ ఏపీలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. అంటే ఇప్పుడు జగన్ కూడా ప్రజా అభిప్రాయాన్ని అవమానించినట్లేనా..?అంటూ ప్రశ్నిస్తున్నారు సీనియర్ జర్నలిస్టు సోదరులు.
The latest poster of Vrushakarma features Naga Chaitanya holding a distinctive weapon against a mysterious…
The popular reality show The Traitors is making its Telugu debut with Prime Video’s The…