Telugu

రాష్ట్రంలో ఆడపడుచులందరికీ అన్న… సొంత చెల్లెలికి కాదా?

సిఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళలందరినీ అవ్వ, అక్కా, చెల్లి, మేనకోడలు అంటూ వరుసలు పెట్టి పిలుస్తూ వారందరికీ సంక్షేమ పధకాల పేరుతో వరాలు ప్రకటిస్తుంటారు. అయితే సొంత తల్లి, చెల్లిని మాత్రం దూరం పెడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ADVERTISEMENT

ఆస్తుల పంపకాల విషయంలో అన్నతో విభేదించి వైఎస్ షర్మిల తెలంగాణకు వెళ్ళిపోయి సొంత పార్టీ పెట్టుకోగా, ఆమె కోసం కొడుకుని విడిచిపెట్టి విజయమ్మ కూడా వెళ్ళిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వారి మద్య ఎన్ని విభేధాలున్నప్పటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి రోజులలో ఇడుపులపాయలో అందరూ కలిసి నివాళులు ఆర్పిస్తుండేవారు. కానీ అప్పుడూ ఒకరినొకరు పలకరించుకోకుండా ఎడమొహం, పెడమొహం పెట్టుకొని ఆ కార్యక్రమంలో పాల్గొని పూర్తయ్యేక ఎవరి దారిన వారు వెళ్ళిపోయేవారు.

ఇదివరకు కలిసినప్పుడు వైఎస్ షర్మిల అన్నపై ఏదో విషయం చిర్రుబుర్రులాడినట్లు వార్తలు వచ్చాయి. అదీగాక ఈసారి తండ్రి సమాధి వద్దే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటన చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక ఒకవేళ సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా అదే సమయంలో అక్కడ ఉంటే మీడియా ఎదుట చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది.

కనుక విజయమ్మ, వైఎస్ షర్మిల ఇద్దరూ వచ్చి నివాళులు అర్పించి అక్కడి నుంచి వెళ్ళిపోయాక సిఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.

విజయమ్మ, వైఎస్ షర్మిల శుక్రవారం సాయంత్రం ఇడుపులపాయ చేరుకొని శనివారం ఉదయం 8 గంటలకు వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొని నివాళులు అర్పిస్తారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు సిఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ చేరుకొని తండ్రికి నివాళులు ఆర్పిస్తారని సమాచారం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Reality: Devika Bhat’s First Look as Aalochana

Kiran Abbavaram, who has acted in several successful films, is making his directorial debut with…

24 minutes ago

Nagarjuna Surprised After Watching Itllu Arjuna

Nagarjuna has decided to present the film Itllu Arjuna under his Annapurna Studios banner after…

45 minutes ago