
శాసనసభలో బుగ్గన బడ్జెట్ ప్రసంగం రాష్ట్ర ప్రజల చెవులలో ఇంకా రింగుమని మారుమ్రోగుతూనే ఉంది. ఇంతలోనే సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఈరోజు సాయంత్రం 7.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్ లభిస్తే ఈరోజు లేదా రేపు భేటీ అయ్యి రాష్ట్రానికి రావలసిన నిధుల బకాయిలు, రాష్ట్రానికి సంబందించిన అంశాల గురించి వారితో చర్చినేందుకు సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరుతున్నట్లు సమాచారం. ఈనెలాఖరులోగా ఉద్యోగుల డీఏ బకాయిలు రూ.3,000 కోట్లు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే చెల్లింపులు ప్రారంభించిన్నట్లు సమాచారం. మరో 15 రోజులలో మళ్ళీ ఒకటో తారీఖు వచ్చేస్తుంది. అప్పుడు జీతాలు కూడా చెల్లించాలి. నెలనెలా సంక్షేమ పధకాలు ఉండనే ఉన్నాయి. వాటికీ నిధులు కావాలి. రాజధాని అంశంపై త్వరగా తేల్చమంటే సుప్రీంకోర్టు పట్టించుకోవడం లేదు. కనుక దాని గురించి కూడా ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలకు విన్నవించుకోవలసి ఉంటుంది. కనుక శాసనసభలో బడ్జెట్ ప్రసంగం ఎంత సమ్మగా ఉన్నా ఈ కష్టాలు ఎప్పటికీ తీరేవి కావు. కనుక ఢిల్లీ పోయి రావలె!
Three Cockroach Janata Party (CJP) leaders detained ahead of a protest demanding the resignation of…
Ravi Teja joins filmmaker Vivek Athreya, who is known for his distinct storytelling style, for…