
రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్లగలిగేవారు మీరొక్కరే. ఆ నైతిక హక్కు మీకు మాత్రమే ఉంది. మీరందరూ ప్రభుత్వంలో భాగం కాదు… ప్రభుత్వోద్యోగులు కారు. కేవలం సేవాభావంతో వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. నేను ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నప్పుడే చెప్పాను… మీలో నుంచి నాయకులను తయారుచేస్తానని. ఈ మూడేళ్ళలో మిమ్మల్ని మీరు నిరూపించుకొని నేడు ఈ అవార్డులు, నగదు బహుమతులు అందుకొంటున్నారు. పేదల కోసం నేను చేసే మంచిలో మీరు భాగస్వాములు అవుతుంటే ప్రతిపక్షాలు, వాటి అనుకూల మీడియా మీ గురించి, నా గురించి తప్పుడు ప్రచారం చేస్తోంది,” అని అన్నారు.
సిఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం విన్నప్పుడు, ఆయన తన పార్టీ నేతలు, ఎమ్మెల్యేల కంటే వాలంటీర్ల మీదనే ఎక్కువ నమ్మకం పెట్టుకొన్నట్లనిపిస్తుంది. ఈ వాలంటీర్ వ్యవస్థ కారణంగానే మంత్రులు, ఎమ్మెల్యేలకి ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి. గడప గడపకి కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎదురైన చేదు అనుభవాలే ఇందుకు నిదర్శనం.
పార్టీ కార్యకర్తలలో నుంచి సమర్ధులైనవారిని గుర్తించి నేతలను తయారుచేసుకొన్నట్లుగానే, వాలంటీర్లలో నుంచి లీడర్లను తయారుచేసుకొంటానని చెప్పడం గమనిస్తే వారిలో సమర్ధులకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు టికెట్స్ ఇస్తానని చెపుతునట్లుందికనుక ప్రజలతో సత్సంబంధాలు కలిగి, సమర్దత నిరూపించుకొన్నవారిని ఎంపిక చేసుకొన్నారు కనుక వారిలో కొందరికి వచ్చే ఎన్నికలలో శాసనసభకు పోటీ చేసేందుకు టికెట్లు ఇస్తారేమో?ఇదే నిజమైతే మరి సిట్టింగ్ ఎమ్మెల్యేల సంగతి?
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…