
మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి చట్టభద్రత, ఉద్యోగ భద్రత లేని వాలంటీర్ వ్యవస్థని సృష్టించి, దానిని 5 ఏళ్ళు విచ్చలవిడిగా వైసీపి కోసం వాడుకున్నారు. కానీ ఎన్నికలలో వారి సేవలు ఉపయోగించుకోవడానికి వీల్లేదని ఈసీ ఆంక్షలు విధించినప్పుడు, వారి జోలికి వెళ్ళకుండా ఊరుకున్నా నేడు వాలంటీర్లకు ఇన్ని కష్టాలు, కన్నీళ్ళు ఉండేవి కావు. కానీ వైసీపి నేతలు వారిచేత బలవంతంగా రాజీనామాలు చేయించడంతో 1.08 లక్షల మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారు.
వారే కాదు… వారి చేత బలవంతంగా రాజీనామాలు చేయించిన వైసీపి నాయకులపై కూడా ఇప్పుడు పోలీస్ కేసులు నమోదు అవుతున్నాయి. ఎన్నికలలో కోట్ల రూపాయలు మంచి నీళ్ళలా ఖర్చు పెట్టి ఓడిపోయినందుకు వైసీపి నేతలు బాధపడుతుంటే ఇప్పుడు వారి మెడలకు ఈ పోలీస్ కేసులు కూడా చుట్టుకుంటుండటంతో అందరూ తలలు పట్టుకుంటున్నారు. అంటే జగన్ అనాలోచిత నిర్ణయానికి వైసీపి నేతలకు ఓడిపోయినా సమస్యలు తప్పడం లేదన్న మాట!
వాలంటీర్ల విషయానికి వస్తే వారి కష్టాలు, కన్నీళ్ళు అర్దం చేసుకోవచ్చు. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందు ఇంతకంటే ఇంకా చాలా పెద్ద పెద్ద సమస్యలు సిద్దంగా ఉన్నాయి. వాటి గురించి అందరికీ తెలుసు. కనుక అవన్నీ చెప్పుకోనవసరం లేదు.
అదీగాక జగన్ వాలంటీర్ వ్యవస్థతో పాటు సచివాలయ వ్యవస్థని కూడా కొత్తగా సృష్టించి ప్రభుత్వంపై అదనపు భారం మోపారు. కనుక ఈ రెండు వ్యవస్థలలో లోటుపాట్లని, వాటిలో వైసీపి విధేయులను ముందుగా గుర్తించాల్సి ఉంటుంది.
ఆ రెండు వ్యవస్థలని సమూలంగా ప్రక్షాళన చేసి, అవసరమైన మార్పులు చేర్పులు చేసి, విధివిధానాలు రూపొందించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఉపయోగించుకుంటుంది.
కానీ చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రాధాన్యతా క్రమంలో అతి ముఖ్యమైన పనులపై దృష్టి పెడుతున్నందున వాలంటీర్లు మరికొన్ని నెలలు వేచి చూడక తప్పదు.
కానీ ఈ కేసులతో అటు వైసీపి నేతలకు, జీతాలు అందక ఇటు వాలంటీర్లకు ఇబ్బందులు వద్దనుకుంటే, మధ్యే మార్గంగా వారి చేత బలవంతంగా రాజీనామాలు చేయించిన వారు లేదా వైసీపి తరపున జగన్ గానీ వాలంటీర్లకు ఓ ఆరు నెలల జీతాలకు సరిపడా సొమ్ముని ప్రభుత్వ ఖజానాకు జమా చేయిస్తే ప్రభుత్వమే వారికి నెల నెలా జీతాలు చెల్లించవచ్చు. ఒకవేళ జగన్-వైసీపి నేతలు వాలంటీర్లకు జీతాలు చెల్లించేందుకు అంగీకరించకపోతే, అదే విషయం జగన్ చేతనే బహిరంగంగా ప్రకటింపజేయించ గలిగితే మరీ మంచిది.
Faith, festivity, and the significance of the divine feminine come together in Amma Kadhili Vacche,…
Prabhas is known for his generous nature and lavish food spreads for his cast and…