Telugu

జగన్ ఆ రెండు కులాలను ఎందుకు టార్గెట్ చేసుకొన్నారంటే…

సాధారణంగా ఏ రాజకీయ నాయకుడికైనా ఏవిషయంలోనైనా ఎదురుదెబ్బ తింటే వెంటనే తన కుల ప్రజలందరికీ అన్యాయం జరిగిపోయిందన్నట్లు మాట్లాడుతుంటాడు. ఎన్నికలప్పుడు అన్ని పార్టీలు ఆయా నియోజకవర్గాలలో కులాల లెక్కలు చూసుకొనే అభ్యర్ధులను ఖరారు చేస్తుంటాయి. మన రాజకీయాలలో కులానికి అంత బలం ఉంది కనుకనే ఏ పార్టీ కూడా ఏ కులాన్ని, ఆ ప్రజలని దూరం చేసుకోవాలనుకోదు. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏపీలోని కమ్మ, కాపు కులాల ఓట్లు తమ పార్టీకి అవసరమే లేదన్నట్లు వ్యవహరిస్తుండటం విశేషం.

గమ్మతైన విషయం ఏమిటంటే, కమ్మ, కాపు కులస్థులు ఎవరూ ఏనాడూ వైసీపీని, సిఎం జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించలేదు. కానీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు నాయుడుని, కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్‌ కళ్యాణ్‌లను జగన్‌ ద్వేషిస్తున్నారు కనుక వారి కులాలను, ఓటర్లను కూడా శత్రువులుగా భావిస్తూ దూరం చేసుకోవడమే చాలా విడ్డూరం.

ADVERTISEMENT

అమరావతిపై కమ్మ కులం ముద్రవేయడం, పవన్‌ కళ్యాణ్‌ని దత్తపుత్రుడు అంటూ వేధిస్తుండటం వలన ఆ రెండు కులాల ఓటర్లు వైసీపీకి శాస్వితంగా దూరం అవుతారని తెలిసి ఉన్నా సిఎం జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం వెనుకాడటం లేదు. కనీసం చేస్తున్న పొరపాటును సరిదిద్దుకొని మళ్ళీ వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నం కూడా చేయకపోవడం గమనిస్తే సిఎం జగన్ వారిని పూర్తిగా వదులుకొనేందుకు సిద్దపడినట్లు అర్దమవుతోంది. ఇద్దరు ప్రతిపక్ష నాయకులపై ద్వేషంతో రెండు కులాలకు చెందిన లక్షల మంది ఓటర్లను వదులుకోవాలని అనుకోవడం అహంభావమా లేక రాజకీయ అజ్ఞానం అనుకోవాలో తెలీదు. మంత్రులెవరికీ ఇది తప్పని సిఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పగలిగే ధైర్యం లేకనే ఆయనకు వంతపాడుతున్నారని భావించవచ్చు.

అయితే ఆ లోటుని సిఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీల ఓట్లతో భర్తీ చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకే ఇప్పుడు మంత్రులు విశాఖ రాజధానై అంశాన్ని కులాలతో ముడిపెట్టి బీసీ ల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. కానీ రేపు బీసీలతో కూడా తమ అధినేత ఇలాగే వ్యవహరిస్తే తమ పరిస్థితి ఏమిటనే భయం వైసీపీ నేతలని వెంటాడుతూనే ఉంది. కానీ తామందరం జగన్ పేరు, ఫోటోతో గెలిచేయొచ్చనే వెర్రి ధీమా కూడా ఉన్నందునే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కులాల చిచ్చు రగిలించి గట్టెక్కేయాలని భావిస్తున్నారు.

అందరినీ కలుపుకుపోలేని ఏ పార్టీ, ఏ నాయకుడు కూడా రాజకీయాలలో రాణించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కనుక వైసీపీ నేతలు ఏం మాట్లాడినా చెల్లుతుంది. కనుక వైసీపీ కుల రాజకీయాలు ఫలిస్తాయో లేదో ఎన్నికలోస్తే తేలిపోతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vijayawada Mayor Race: Is Chandrababu Behind ABV?

Former MP Vijayasai Reddy has launched a sharp attack on the TDP-led alliance and YSRCP…

26 minutes ago

AP Local Polls: YSRCP’s Loss, Congress’s Gain

Andhra Pradesh needs a strong opposition to question the TDP-led government and hold it accountable.…

46 minutes ago