Telugu

“వై.ఎస్.ఆర్.సి.పి.” కి “వై” దిస్ కొలవరి..?

వై.సి.పి పార్టీ కి మళ్ళి గడ్డుకాలం మొదలైందనే చెప్పాలి. నంద్యాల ఉపఎన్నిక ముందు ఏంతో రెట్టించిన ఉత్సహంతో కనపడిన వై.సి.పి నాయకులూ ఆ తరువాత ఒక్కసారిగా స్తబ్ధత పాటిస్తున్నారు. పార్టీ నేతలలో ఏదో నిరాశ, నిస్పృహలు ఆవహించిన చందంగా నాయకులూ విచక్షన కోల్పోయి ఏం మాట్లాడుతున్నారో, ఏల పార్టీని సమర్దిoచాలో తెలియక మల్ల గుల్లాలు పడుతున్నారని అధికార పార్టీ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు.

టి.డి.పి.ప్రవేశపెట్టిన మిషన్ ఆకర్ష పధకానికి మళ్ళి ఎంతమంది నాయకులూ ఫ్యాన్ గుర్తు వదిలి సైకిల్ ఎక్కుతారేమోనని వై.సి.పి అధినేతకు గుబులు మొదలైందని మంత్రి వర్గంలో కొందరు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. జగన్ సి.ఎం అవ్వాలoటే కడప జిల్లా ఒక్క దానినే ప్రత్యేక రాష్ట్రం కిందన మార్చాలని ఆ పార్టీ నాయకులే వారి అధినేత పై సెటైర్లు వేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

నోరు అదుపులో పెట్టు కొకపోతే ఈ కొలవరి ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అది పార్టీ కైనా, పార్టీ అధినేత కైనా గాని. అధినేత అంటే తానూ చెప్పిందే వేదం అనే చందంగా ఉండకూడదని పార్టీలోని సినీయర్ నేతల, మిగత సభ్యల అభిప్రాయాలను, వారి ఆలోచనలను తెలుసుకొని అందరితో సమీక్షించి ప్రత్యర్ధుల పై వ్యూహాత్మక విమర్శలు చేసి ప్రత్యర్ధి పార్టీని ఇరుకున పెట్టాలి.

కాని ఇక్కడ మాత్రం ప్రతిపక్ష పార్టీ అధినేత అంటే సి.ఎం స్థాయి వ్యక్తిని కిoచపరచడమే అన్న తీరుగా విమర్శలు చేసారు అనేది ఎక్కువ శాతం ప్రజల అభిప్రాయమే కాదు వారి పార్టీ నేతల ఉద్దేశం కుడా. ప్రతిపక్ష నేత అంటే ప్రజల సమస్యల పై సి.ఎం స్థాయి వ్యక్తితో రాజకీయ యుద్ధం చేయడం అంతే కాని కాల్చాలి, ఉరితీయాలి అంటే ప్రజల నుండి ఇలాంటి గుణపాటాలే చవి చూడాల్సి వస్తుంది అనే అధికార పార్టీ నాయకుల మాటలకు బలం చేకూరినట్లుగా ఉన్నాయి ఫలితాలు చూస్తుంటే.

చంద్రబాబు నాయుడు సి.ఎం గా ఉంటేనే మీ ఫ్యాన్ తిరగడానికి కావలసిన కరెంటు అందుబాటులో ఉంటుంది, అప్పుడే మీ పార్టీ లో కొంతమందైనా ఆ ఫ్యాన్ కింద సేదతీరుతారని దీనిని గుర్తుపెట్టుకొని జగన్, జగన్ భజన బ్యాచ్ వారి కార్య చరణ రూపొందిచుకోవాలని అధికార పార్టీ కార్యకర్తలు జగన్ కు ఒక ఉచిత సలహా ఇస్తున్నారు.

కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలలో వచ్చిన ఫలితాలతో మరో సారి ఖంగుతిన్న జగన్ పార్టీ ఓటమికి కారణాలు వెదకడం కన్నా పార్టీలో నుండి “జoప్ – జిలానీలను” కాపాడుకోవడంలో తల మునకలవుతున్నారని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ పై వ్యంగ్యాస్త్రాలు సందిస్తుoది. చేసే పనిలో చిత్త సుద్ది, నిజాయితీ ఉంటే ప్రతిపక్ష నాయకుడికి ఇటువంటి “కొలవరి” సమస్యలు ఉండవనే చెప్పాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Paradise 22 Days Left: Can Odela Avoid Toxic Mistakes?

Ravi Teja took the box office by storm in August. Irumudi came without the huge…

11 minutes ago

Kalki 2: Nag Ashwin Raises Major Doubts on Prabhas Film

Kalki 2898 AD changed the game for Prabhas. After films like Saaho, Radhe Shyam, and…

40 minutes ago