
[m9ad]
ఆ తరువాతి స్థానంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్, 9.21 కోట్ల వ్యక్తిగత, 10.76 కోట్ల కుటుంబ ఆదాయంతో 8వ స్థానంలో ఉన్నారు. ఆపై వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు 8.49 కోట్ల వ్యక్తిగత, 8.61 కోట్ల కుటుంబ ఆదాయంతో 10వ స్థానంలో, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 6.48 కోట్ల వ్యక్తిగత ఆదాయంతో, 7.96 కోట్ల కుటుంబ ఆదాయంతో 14వ స్థానంలో ఉన్నారు.
ఆపై 19వ స్థానంలో నిలిచిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, 4.85 కోట్ల వ్యక్తిగత, 5.54 కోట్ల కుటుంబ ఆదాయంతో నిలిచారు. ఇక అత్యల్ప ఆదాయం ఉన్న తెలుగు ఎమ్మెల్యేల విషయానికి వస్తే, శింగనమల ఎమ్మెల్యే బి.యామినీ బాల వ్యక్తిగత ఆదాయం 1,301 అని, కుటుంబ ఆదాయం కూడా అంతేనని ఏడీఆర్ పేర్కొంది. దేశవ్యాప్తంగా దక్షిణాది ఎమ్మెల్యేలు శ్రీమంతులుగా ఉండగా, ఈశాన్య ఎమ్మెల్యేలు పేదలని ఏడీఆర్ వెల్లడించింది.
గత ఎన్నికల సందర్భంగా 3,145 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్ లను మధించి ఈ వివరాలు సేకరించామని పేర్కొంది. దక్షిణాదిన ఉన్న 711 మంది ఎమ్మెల్యేల వార్షికాదాయం 51.99 లక్షలని, ఈశాన్య రాష్ట్రాల్లోని 614 మంది ఎమ్మెల్యేల వార్షికాదాయం 8.53 లక్షలని తెలిపింది. ఇక 139 మంది ఎమ్మెల్యేలు ఎనిమిదో తరగతి వరకూ మాత్రమే చదువుకున్నారని, వీరి ఆదాయం చాలా ఎక్కువని ఆసక్తికర నిజాన్ని వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో 50 ఏళ్ల లోపున్న ఎమ్మెల్యేల సంఖ్య 1,402గా ఉండగా, 80 ఏళ్లలోపు 1,727 మంది, 90 ఏళ్ల వరకూ వయసున్న వారు 11 మంది ఉన్నారని ఏడీఆర్ తెలిపింది. మొత్తం ఎమ్మెల్యేల్లో 8 శాతం మంది మాత్రమే మహిళలని పేర్కొంది. ఈ వివరాల ప్రకారం… ఆదాయంలో అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డే కింగ్ అన్న విషయం తేటతెల్లమైంది.
The YS family feud is getting bigger everyday and here comes one more twist. First,…
One casual comment from Nivetha Pethuraj at the Aadarsha Kutumbam pre-release event suddenly became a…