మోడీ, అమిత్ షాలకే కాదు… జగన్‌కు కూడా తెలియదట!

ఈరోజు విజయవాడ ఇందిరా స్టేడియంలో ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి చెప్పిన మాటలు వింటే ఎవరైనా నోరు వెళ్ళబెట్టాల్సిందే.

ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన్నట్లు తనకు తెలియదని, తాను విదేశాలలో ఉండగా అవినీతి కేసులలో అరెస్ట్ చేశారని, దాంతో తనకు ఎటువంటి సంబందమూ లేదని జగన్‌ అన్నారు.

ADVERTISEMENT

అంటే ఓ మాజీ ముఖ్యమంత్రి, ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేతని ముఖ్యమంత్రికి తెలియజేయకుండానే ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారని జనం నమ్మాలన్నమాట!

మోడీ, అమిత్ షాలు ఈవిషయం తమకు తెలియన్నట్లు ఉంటున్నారు. అది వారిష్టం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఇంత పెద్ద విషయం తెలియదని నమ్మబలకడం విడ్డూరంగా లేదా?

జగన్‌ నమ్మశక్యం కానీ మరో మాట కూడా అన్నారు. అదే… చంద్రబాబు నాయుడుపై తనకు ఎటువంటి కక్ష, ద్వేషం లేవని ఆయనపై తాను కక్ష సాధించవలసిన అవసరమే లేదన్నారు. మరి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీరోజూ ఆయనను ద్వేషిస్తూనే మాట్లాడుతున్నారు కదా?ఆయనపై ద్వేషంతోనే అమరావతితో సహా అన్ని నిర్ణయాలను పక్కన పడేశారు కదా?

ఒకవేళ ఆయనపై తాను కక్ష సాధిస్తున్నానని టిడిపి భావిస్తున్నట్లయితే, ప్రధాని మోడీతో నేరుగా మాట్లాడగల శక్తి సామర్ధ్యాలున్న పవన్‌ కళ్యాణ్‌, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఏపీ బీజేపీలో ఇంకా చాలా మంది నేతలు చంద్రబాబు నాయుడు వెంటే ఉన్నారు కదా?చిటికలో విడిపించేసి ఉండేవారు కదా?అని జగన్‌ ఎద్దేవా చేశారు. ఈ విషయంలో జగన్‌ చెప్పింది అక్షరాల నిజమే. చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ల గుడ్డి నమ్మకమే వారి కొంప ముంచిందని చెప్పక తప్పదు.

విశ్వసనీయత లేని చంద్రబాబు నాయుడు బయట ఉన్నా జైల్లో ఉన్నా ఒకటేనని, ఆయనను సమర్ధించడం అంటే రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల సంక్షేమాన్ని వ్యతిరేకించడమే అని జగన్ తేల్చి చెప్పేశారు.

అమరావతే రాజధానిగా ఉంటుందని, ప్రత్యేక హోదా సాధిస్తానని, ఉద్యోగులు కోరుకొన్న పెన్షన్ విధానమే అమలుచేస్తామని చెప్పి మాట తప్పింది ఎవరు?ఇదేనా విశ్వసనీయత?

పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు నాయుడుకి విశ్వసనీయత లేదని, జనసేన జెండా మోసే కార్యకర్తలు లేరని జగన్‌ ఎద్దేవా చేశారు. మరి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరధం ఎందుకు పడుతున్నట్లు?

బటన్ నొక్కుడు సభలకు వైసీపి నేతలు వాలంటీర్లతో జనసమీకరణ చేయించవలసి వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ సభలకు వేలాదిగా జనాలు స్వచ్ఛందంగా తరలివస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

ఒకవేళ వారికి విశ్వసనీయత లేకుంటే, వారి వలన సమాజానికి నష్టం కలుగుతోందనుకొంటే, ప్రజాలెందుకు తరలివస్తున్నారు?అసలు వారికే విశ్వసనీయత ఉంది తప్ప వైసీపికి కాదు. ఉండి ఉంటే ఇంత కక్ష సాధించనవసరం లేదు కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AA23: The Rumour Hunt Around Allu Arjun Continues

Rumours around the Allu Arjun-Lokesh Kanagaraj project just refuse to die down. A couple of…

10 minutes ago

#MythriInLove: Jai Jasti & Medha Meka’s Tender Moment

A new pairing, a contemporary love story, and a team making its first steps into…

12 minutes ago