
ఈసారి పర్యటనలో సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలని కలుస్తారా లేదా?అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది. ఈ నెలాఖరు నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నందున, బడ్జెట్లో ఏపీకి తగినన్ని కేటాయింపులు చేయాలని కోరుతూ ఏపీకి చెందిన కొందరు ఉన్నతాధికారులు ఢిల్లీలో మంత్రుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. కనుక బడ్జెట్‌కి ముందే సిఎం జగన్ ప్రధాని నరేంద్రమోడీని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని కలవడం చాలా అవసరమే.
వారి అపాయింట్మెంట్ లభిస్తే కలిసి ఏపీకి పెండింగులో ఉన్న ప్రాజెక్టులకి అనుమతులు, నిధులు బడ్జెట్లో కేటాయించవలసిందిగా కోరనున్నారు. మరో రెండు రోజులలో మళ్ళీ ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకి జీతాలు, పెన్షనర్లకి పెన్షన్లు చెల్లించాల్సి ఉంటుంది. వాటికీ నిధులు అవసరం. కానీ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ అమిత్ షా ఇరువురూ బడ్జెట్ సమావేశాల హడావుడిలో ఉన్నందున సిఎం జగన్‌కి వారి అపాయింట్మెంట్ లభిస్తుందో మంగళవారం నాటికి తెలిసే అవకాశం ఉంది.
The NDA alliance is facing growing discontent over seat sharing in Tiruvuru and Salur, with…
రాజకీయాలలో పార్టీల మధ్య పొత్తులు అనేవి సర్వసాధారణం. అయితే ఆ పొత్తుల వలన పార్టీలకు ఒక్కోసారి ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు…