
ముఖ్యంగా గోరంట్ల మాధవ్ నగ్న వీడియో బయటపడినప్పటికీ ఆయన నిసిగ్గుగా సమాజంలో తిరుగుతుండటం, ఆయనను వైసీపీ ప్రభుత్వం వెనకేసుకువస్తుండటం రెండూ ఆశ్చర్యకరమే. ఈ వ్యవహారంలో గోరంట్లకు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప క్లీన్ చిట్ ఇచ్చేసిన తర్వాత “ఒరేయ్ కొడకల్లారా ఫేక్ వీడియో కాదు… మీ ఇంటికే వచ్చి ఒరిజినల్ చూపిస్తా,” అంటూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణలను ఉద్దేశ్యించి గోరంట్ల మాధవ్ మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకొనేలా ఉన్నాయి.
అసలు తన నగ్న వీడియో అసలైనదో మార్ఫింగ్ చేసినదో బయటపడినప్పుడే ఎంపీ గోరంట్ల మాధవ్ బయట తలెత్తుకొని తిరగలేని పరిస్థితి. కానీ ఆయన ఏమాత్రం జంకుగొంకూ లేకుండా తిరుగుతుండటమే కాక ఇంత నీచంగా మాట్లాడటం చాలా దిగ్బ్రాంతి కలిగిస్తుంది. గోరంట్ల వీడియో నకిలీది అనుకొన్నా ఇప్పుడు ఆయన మాట్లాడిన ఈమాటలు నిజమైనవే కదా? ఆ మాటలు ఆయన నైజానికి అద్దం పడుతున్నాయి కదా?
వీడియో వ్యవహారంలో ఆయనపై చర్యలు తీసుకోకపోయినా కనీసం ఇప్పుడైనా ఈవిదంగా మాట్లాడినందుకు సిఎం జగన్మోహన్ రెడ్డి గోరంట్ల మాధవ్ను గట్టిగా మందలిస్తారని అందరూ ఎదురుచూశారు. కానీ పట్టించుకొనేలేదు. రాష్ట్రంలో తనకు తిరుగేలేదనుకొనే సిఎం జగన్మోహన్ రెడ్డి అంతటివాడు తనను ఏమీ చేయలేరని గోరంట్ల మాధవ్ గ్రహించినందునే రెచ్చిపోతున్నారేమో?
ఏదిఏమైనప్పటికీ వచ్చే ఎన్నికలలో జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన వైసీపీ మునుగుతుందా లేక ఇటువంటి వారందరూ కలిసి వైసీపీని ముంచేస్తారా?
The YSR Congress Party (YSRCP) is facing a major challenge in Andhra Pradesh’s Local Body…
Misha Narang gives casual dressing a stylish little shakeup in this breezy photoshoot. An oversized…