
అనంతపురం జిల్లాలో 2014 ఎన్నికలలో టీడీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. తన పాదయాత్రతో జిల్లాపై పట్టు సాధించాలని జగన్ ప్రయత్నం. ఇప్పటివరకు 25 రోజులపాటు సాగిన జగన్ పాదయాత్ర 356.8 కిలోమీటర్ల దూరం సాగింది. ఇప్పటివరకు కడప జిల్లా మరియు కర్నూల్ జిల్లాలలో ఆయన పాదయాత్ర సాగింది.
మధ్యమధ్యలో శుక్రవారం కోర్టు పనులమీద హైదరాబాద్ వెళ్లడం తప్ప జగన్ ఏకధాటిగా నడిచారు. ఈ పాదయాత్ర ఆయనను ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చోబెడుతుందని ఆయన నమ్మకం. 120 నియోజకవర్గాల పాదయాత్ర తరువాత జగన్ 50 నియోజకవర్గాలలో బస్సు యాత్ర చెయ్యనున్నారు. తద్వారా అన్ని నియోజకవర్గాలు కవర్ చెయ్యాలని ఆయన ప్లాన్.
సినిమా రిలీజ్‌కు ముందు నిర్మాత నాగవంశీ పేరు ట్విట్టర్‌లో తెగ తిరుగుతోంది. సినిమా గురించి కాదు. ఆయన వ్యక్తిగత జీవితంపై…
While Sanjay Leela Bhansali is busy completing Love & War, he has been equally working…