
అయితే పంటల సీజన్ కాబట్టి నేతలకు జనాన్ని తరలించడం కష్టంగా మారిందట! దీనితో వీలైనంత వరకు బహిరంగ సభలు తగ్గించుకోవాలని వారు అధినాయకుడికి సూచిస్తున్నారు. రాష్ట్రంలో నెమ్మదిగా ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. దీనితో జన సమీకరణ మరింత కష్టంగా మారబోతుందని ఆ పార్టీ నాయకులు కలవరపడుతున్నారు.
ఇప్పటిదాకా జగన్ పాదయాత్ర సగం కూడా పూర్తి కాలేదు. దాదాపుగా 1700 కిలోమీటర్ల మేర నడవాల్సింది మిగిలి ఉంది. చూడబోతే వేసవి అంతా ఆయన నడవాల్సి వచ్చేలా ఉంది. కాబట్టి నేతలు కాస్త కలవరపడుతున్నారు. పార్టీ గనుక బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయిస్తే ఒక నెల విరామం రావొచ్చు అని నేతలు భావిస్తున్నారు.
After a long wait, Mirzapur The Movie is arriving on the big screen on September…
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…