
ఇప్పుడు ఆకాశంలో ఎక్కడా రాబందులు కనిపించడం లేదు కానీ నేలపై చాలా కనిపిస్తున్నాయి. రాబందులు ఎక్కడైనా కళేబరాలు కనిపిస్తే అక్కడ వాలి వాటిని పీక్కు తింటాయి. ఆవిదంగా చేస్తూ అవి సమాజానికి ఎంతో మేలు చేస్తుంటాయి.
కానీ రాష్ట్రంలో ఎక్కడ ఎవరు ఏ కారణంతో చనిపోయినా, ప్రమాదాలలో మరణాలు సంభవించినా వైసీపి వెంటనే వాటిపై శవరాజకీయాలు చేసే వైసీపి వలన సమాజానికి ఏ ఉపయోగమూ ఉండదు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీ విషాద ఘటనపై అప్పుడే వైసీపి శవ రాజకీయాలు మొదలు పెట్టేసింది.
బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సోషల్ మీడియాలో అప్పుడే దుష్ప్రచారం మొదలుపెట్టేసింది. బాధితులను ఎయిర్ అంబులెన్సులలో విశాఖ తరలించి చికిత్స అందించాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించిన కొందరు అధికారులు క్షతగాత్రులను అనకాపల్లికి తీసుకువెళ్ళారు.
అచ్యుతాపురానికి విశాఖ 30 కిమీ దూరంలో ఉండగా అనకాపల్లి 14 కిమీ లోపే ఉంది. కనుక ముందుగా అనకాపల్లికి తీసుకువెళ్ళి అత్యవసర చికిత్స అందించవచ్చనే సదుద్దేశ్యంతోనే వారు ఆవిదంగా చేసి ఉండొచ్చని అర్దమవుతూనే ఉంది. కానీ మళ్ళీ విశాఖకు తరలించారు.
దీనినే వైసీపి తప్పు పడుతోంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంలో, క్రైసిస్ మేనేజ్‌మెంట్‌లో సిఎం చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారంటూ దుష్ప్రచారం మొదలుపెట్టేసింది.
ఆనాడు జగన్ హయాంలో అంటే 2020, మే 7వ తేదీన విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువులు లీక్ అయినప్పుడు అనేకమంది ప్రజలు రోడ్లపైనే కుప్ప కూలిపోతుంటే ఏమి చేయాలో తెలియని అయోమయంలో విలువైన సమయం వృధా చేశారు. ఆ కారణంగా 12 మంది మృతి చెందారు. అనేకమంది తీవ్ర అస్వస్థులయ్యారు.
అప్పుడు చేతులెత్తేసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు క్రైసిస్ మేనేజ్‌మెంట్ గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉంది కదా?
ఐదేళ్ళు అధికారంలో ఉండి ప్రజలను మెప్పించలేకపోయిన వైసీపి ఇప్పుడు ఈ శవరాజకీయాలతో రాష్ట్ర ప్రజలను మెప్పించగలమనే
Anukreethy Vas makes a simple lace and denim pairing feel like a proper fashion moment.…
Today, Prime Minister Narendra Modi inaugurated the Vadapalani to Poonamallee stretch of the Phase 2…