
మరో వారంలో 2023 ముగిసి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ ఏడాది ఏపీ రాజకీయాలను ఓసారి రీవైండ్ చేసి చూస్తే, నలుగురు ప్రధానంగా కనిపిస్తారు. ఏపీ సిఎం జగన్, మాజీ సిఎం చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ నలుగురూ రాష్ట్ర రాజకీయాలను గతంలో కనీవినీ ఎరుగనంతగా ప్రభావితం చేశారు.
జగన్మోహన్ రెడ్డి: ప్రతిపక్ష నేతలతో పోలిస్తే జగన్ ప్రజల మద్యకు వచ్చేది చాలా తక్కువే. సంక్షేమ పధకాల సభలకే బయటకువస్తారనే అపకీర్తి మూటగట్టుకొన్నారు. కానీ తాడేపల్లి ప్యాలస్లో నుంచే తన మంత్రులు, ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను పరుగులు తీయిస్తూనే ఉన్నారు. ప్యాలస్ నుంచి బయటకు వచ్చిన ప్రతీసారి టిడిపి, జనసేనలపై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు.
ఏపీ ప్రజలు ‘వైఎస్సార్ మార్క్ పాలన’ చూడాలని ఆశపడితే, దానిలో సంక్షేమ పధకాలను మాత్రమే తీసుకొని మిగిలినదంతా తన మార్క్ ‘పవర్ పాలిటిక్స్’ చేశారు. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం వాటిలో ఒకటిగా చెప్పుకోవచ్చు.
మూడు రాజధానులంటూ అనూహ్యమైన ప్రతిపాదన చేసి దేశప్రజల దృష్టిని కూడా ఆకర్షించిన జగన్ కనీసం ఒక్క రాజధాని (విశాఖ) కూడా ఏర్పాటు చేయలేకపోయారనే అప్రదిష్ట మూటగట్టుకొన్నారు.
తాజాగా వైసీపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలను మార్చేస్తున్నారు. వాటి పర్యవసనాలను పక్కన పెట్టి చూస్తే, ఎన్నికలకు ముందు ఇటువంటి ప్రయోగాలు చేయడం చాలా దుస్సాహసమే అని అందరికీ తెలుసు. కనుక జగన్ ‘బోల్డ్ అండ్ డాషింగ్ కెప్టెన్’ అని చెప్పక తప్పదు.
వైసీపి అనే టైటానిక్ షిప్పుని నడుపుతున్న కెప్టెన్ జగన్, తనని ఢీకొనడానికి వస్తున్న టిడిపి, జనసేనలని తప్పించుకొని ముందుకు తీసుకువెళతారా లేదా?2024లో చూద్దాము. జగన్ పాలనలో మంచి చెడులను పక్కనపెడితే, ఆయన రాష్ట్ర రాజకీయాలను చాలా తీవ్రంగా ప్రభావితం చేశారని చెప్పక తప్పదు.
The latest poster of Vrushakarma features Naga Chaitanya holding a distinctive weapon against a mysterious…
The popular reality show The Traitors is making its Telugu debut with Prime Video’s The…