Telugu

అమరావతిలో పేదలకు ఇళ్ళు… ఎన్ని కధలో!

గత నాలుగేళ్ళుగా జగన్ ప్రభుత్వం ఏవిదంగా సంక్షేమ పధకాలతో ప్రజలను ప్రసన్నం చేసుకొని ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి రావాలని తాపత్రయపుడుతోందో అదేవిదంగా దేశంలో ఏ ప్రభుత్వామైనా తాపత్రయపడుతుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీని పాలించిన టిడిపి ప్రభుత్వం కూడా అదేవిదంగా తాపత్రయపడింది.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం కింద రాష్ట్రంలో లక్షల ఇళ్ళు నిర్మించింది. ఈ నాలుగేళ్ళలో వాటిలో పనులు మిగిలిపోయిన ఇళ్ళను కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తిచేయకుండా పక్కన పడేసింది. పూర్తయినవాటిని లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో అవి శిధిలావస్థకు చేరుకొన్నాయి.

ADVERTISEMENT

అయితే ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పూర్తయినవాటికి వైసీపీ రంగులు వేసుకొని పంచిపెట్టడం మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం వాటి కోసం సుమారు రూ.9,000 కోట్లు ఇచ్చినప్పటికీ ఈ నాలుగేళ్ళలో వైసీపీ ప్రభుత్వం 35 శాతం ఇళ్ళ నిర్మాణాలు కూడా చేయలేకపోయిందని ఇటీవలే ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఏ ప్రభుత్వామైనా కేంద్రప్రభుత్వం సాయం అందిస్తున్నప్పుడు టిడ్కో ఇళ్లనే నిర్మించాలనుకొంటుంది. కానీ వైసీపీ ప్రభుత్వం సెంటు భూములు పంచి వాటిలో ఇళ్ళు నిర్మిస్తామని చెపుతూ నాలుగేళ్ళు కాలక్షేపం చేసేసింది! సిఎం జగన్‌ ఈరోజు అమరావతిలో వివాదాస్పద భూములనే పంచి ఇచ్చారు తప్ప క్లియర్ టైటిల్‌ భూములను ఇవ్వలేదు. అంటే పేదలకు ఇళ్ళు నిర్మించి ఇవ్వడంలో కూడా వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్దమవుతోంది.

కానీ ఈరోజు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో “చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ వారి అనుకూల మీడియా పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తుంటే అసూయతో రగిలిపోతున్నాయి. పేదలకు ఇళ్ళు ఇవ్వనీయకుండా అడ్డుకొనేందుకు కుట్రలు చేస్తున్నాయంటూ” సిఎం జగన్‌ ఆరోపించడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

వైసీపీ అమరావతిని వ్యతిరేకిస్తున్న కారణంగా ఆ ప్రాంతాలలో తమకి ఓట్లు పడవనే ఉద్దేశ్యంతోనే వేరే ప్రాంతాల వారిని తీసుకువచ్చి అక్కడ సెంటు భూములు పంచిపెట్టి ఓటు బ్యాంక్ సృష్టించుకొంటున్నారని రాజధాని రైతులు వాదిస్తున్నారు.

ఒకవేళ వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓడిపోయినప్పటికీ అమరావతిలో రాజధాని నిర్మాణం జరగకుండా అడ్డుకోవాలనే దురాలోచనతోనే ఈవిదంగా చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ప్రజలకు చాలా మేలు చేస్తున్నామని పదేపదే చెప్పుకొనే వైసీపీ ప్రభుత్వం, ఏ పని చేసినా రాజకీయ ప్రయోజనం ఉండేలా జాగ్రత్తపడుతుంటుంది కానీ చేసే పనిలో చిత్తశుద్ధి ఉండదు. కనుకనే వైసీపీ నిబద్దత ఎప్పుడూ ప్రశ్నార్ధకంగానే ఉంటుంది. కానీ లోకమే తమని చూసి అసూయతో ఏడుస్తుంటుందని వాదిస్తుంటుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

IND vs WI 5th T20I: Bowling Woes Bring Swing King Back!

Bhuvneshwar Kumar is back in India's T20I squad after nearly four years, with the experienced…

3 minutes ago

ఈ జేబులో డబ్బు ఆ జేబులో పెట్టుకున్నా మనదేగా?

కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ఆలోచన చేస్తున్నప్పుడే చిన్న శ్రీనుతో సహా పలువురు టీడీపిలో చేరారు. అదేవిధంగా జనసేనలో…

33 minutes ago