వేలకోట్లు ఉన్నా చెల్లికి వాటా ఇవ్వలేని నిరుపేద….

పేదవాడి మీద వ్యాసం అంటూ సినిమాలో వచ్చే అనగనగా, ఒక పేద కుటుంబం, ఆ కుటుంబంలో తండ్రి చాల పేదవాడు, వాళ్ళ తల్లికూడా పేదదే, వాల్లింటిలో పనోడు, కారు డ్రైవర్, తోటమాలి అందరు పేదవాళ్ళే అంటూ సాగే ఒక కామెడీ సీన్ జగన్ ఆస్తుల వివాదానికి సరిగ్గా సరిపోతుంది అనేలా సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి.

ఇడుపులపాయ, లోటస్ పాండ్, తాడేపల్లి, బెంగళూర్ ఇలా తానూ స్టే చెయ్యాలి అనుకున్న ప్రతి చోట ఒక రాజమహల్ తరహా ప్యాలస్ లు నియమించుకున్న అతి పేదవాడు జగన్. తన రాజకీయ భవిష్యత్ కోసం సొంత తండ్రిని, తల్లిని, చెల్లిని కూడా కోర్ట్ కు ఈడ్చగల పురుషోత్తముడు జగన్ అనేలా షర్మిల వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

ADVERTISEMENT

షర్మిల ఆరోపణల ఆధారంగా చూస్తే జగన్, షర్మిల మధ్య మొదలైన ఈ వివాదానికి మూల కారణం ఆస్తులు అనేది స్పష్టం. అయితే ఈ ఆస్తులు షర్మిల చెపుతున్నట్టు కుటుంబ ఆస్తులా.? లేక వైసీపీ వాదిస్తున్నట్టు జగన్ స్వార్జితమా.? అనేది ఇక్కడ చిక్కుముడి. అయితే ఈ ముడిని విప్పగలిగే ఆ ఇద్దరిలో ఒకరు తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి ఈ లోకంలో లేరు, ఇక రారు.

ఇక తల్లి విజయలక్ష్మి ఉన్నా బయటకు రాలేని పరిస్థితి, నోరు విప్పి జరిగిన నిజం కానీ, జరుగుతున్న అన్యాయం కానీ బయటపెట్టలేని దుస్థితి. ఇక జగన్, షర్మిల వాదనలో బలమెవరిది.? నిజమెవరిది.? అంటే బలం మాత్రం ఖచ్చితంగా వైస్ జగన్ దే అని చెప్పొచ్చు. రాలేని తండ్రి ని దేవుడిగా చూపిస్తూ ఉన్న తల్లిని మానసిక క్షోభ పెడుతూ, చెల్లిని ఒక రాక్షసిగా చిత్రీకరిస్తూ జగన్ చేస్తున్న రాజకీయం నభూతోనభవిష్యతి అని ఒప్పుకోకతప్పదు.

ఎందుకంటే ఒక్క ఆడదాన్ని ఎదుర్కోవడానికి అందునా సొంత చెల్లిని అడ్డుకోవడానికి జగన్ తనకు మద్దతుగా తన పార్టీ సైన్యాన్ని మొత్తాన్ని మీడియా ముందుకు తెస్తున్నారు. అలాగే తన చేతిలో ఉన్న సాక్షితో సహా అన్ని బ్లూ మీడియాలో తనకు అనుకూలంగా తల్లికి, చెల్లికి వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేయిస్తున్నారు.

ఇన్నాళ్లు జగన్ పులివెందుల పులి, సింహం సింగల్ అంటూ జగన్ కు ఎలివేషన్లు ఇచ్చిన ఈ సోకాల్డ్ వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఒక్క మహిళను అడ్డుకోవడానికి ఇంతమందిని తనకు రక్షణ కవచం మాదిరి వాడుకుంటున్న జగన్ వైనాన్ని ఎలా సమర్ధించుకుంటారు.

తానూ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు పేదవాడికి పెత్తందారునికి మధ్య యుద్ధం, సిద్ధమా అంటూ తనను తానూ పేదవాడిగా చెప్పుకున్న జగన్, ఇప్పుడు షర్మిలకు, జగన్ కు మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో జగన్ ఆస్తుల విలువ కొన్ని లక్షల కోట్లు అనేది వైసీపీ పార్టీ నేతలే పరోక్షంగా నిర్దారిస్తున్నారు.

మరి ఇప్పుడు పేదవాడు ఎవరు.? పెత్తందారీ ఎవరు.? అనేది వైస్సార్ క్యాడర్ కూడా స్పష్టత వచ్చినట్టేనా. జిల్లాకో ప్యాలస్, ప్యాలస్ కో వెయ్యిమంది సెక్యూరిటీ, వారికి లక్షల్లో జీతాలు, వేలల్లో తన కోసం పని చేసే పైడ్ సోషల్ మీడియా గుంపు, డబ్బులిచ్చి తన ప్రత్యర్థులను తిట్టేంచేందుకు బోరుగడ్డ, శ్రీ రెడ్డి వంటి ఒక ప్రైవేట్ సైన్యం ఇలా ఎటు చూసిన జగన్ పేదరికం లక్షల్లోనే కనిపిస్తుంది.

అసలు జగన్ వెనుక ఉన్న ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు సంపాధించింది.? అసలు తండ్రి సంపాధించిన ఆస్తుల విలువెంతా.? వీళ్ళ పంపకాల లెక్కేంత.? అనేదాని పై ఇరు వర్గాలు ఒక ఖచ్చితమైన అంకేను సూచించడం లేదు. అసలు వైస్సార్ ముఖ్యమంత్రి కాకముందు వారి ఆస్తుల లెక్కంతా.? వచ్చాక వాటి విలువెంత.? అనే ప్రశ్నకు కూడా ఈ రెండు కుటుంబాలు ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి.

చేతిలో ఇన్ని వేల కోట్ల ఆస్తి ఉన్నా అవి ఈడీ ఎటాచ్ మెంట్ లో ఉండడం వలన తన తల్లి విజయలక్ష్మి కి, చెల్లెలు షర్మిలకు తన స్వార్జితం నుండి ప్రేమతో ఇవ్వాలనుకున్న ఆస్తుల వాటా ఇవ్వలేని పేదవాడు మా జగనన్న, అందుకే తల్లిని చేయిని కోర్ట్ కు ఈడ్చాడు అంటూ అవే భ్రమలలో ఇంకా వైసీపీ నేతలు ప్రజలను ఏమార్చాలనుకుంటున్నారా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Sobhita Dhulipala: Love Is More Than Romance

Sobhita Dhulipala doesn't think love should be limited to romance. For her, friendship is a…

13 minutes ago

CM Vijay @ AP For 1st Time: Religious And Political!

One of the crucial developments with regard to South Indian politics is happening today as…

28 minutes ago