Telugu

దేవుణ్ణి గట్టిగా ప్రార్ధించండి, నేను ముఖ్యమంత్రి కావాలని!

ప్రస్తుత యువతరం ఆలోచనలు ఎలా ఉన్నాయో అని చెప్పడానికి నిదర్శనంగా సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. మేధస్సుల కంటే మెండుగా ఒకరిని మరొకరితో పోలుస్తూ సోషల్ మీడియాలో ఎవరి క్రియేటివిటీని వాళ్ళు ప్రదర్శిస్తున్న దరిమిలా… తాజాగా ఓ వీడియోలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన స్పీచ్ ను మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ ను జోడించి పోస్ట్ చేసారు.

ఇంకేముంది… రెండు భిన్న ధృవాలు కదా… ఈ వీడియో వైరల్ అవుతూ నెట్టింట సందడి చేస్తోంది. అంతేకాదు దీనిపై నేటితరం యువత వేస్తోన్న సెటైరలకు కొదవలేదు. ఇంతకీ ఈ వీడియోలో అంత ఆసక్తికరమైన అంశం ఏముంది? అంటారా… కొత్తగా ఏమీ లేదు గానీ, రొటీన్ గా బహిరంగ వేదికలపై గత మూడు ేసంవత్సరాలుగా డప్పు కొట్టి మరీ జగన్ చెప్తోన్న వ్యాఖ్యలే ఉన్నాయి.

ADVERTISEMENT

“తనను ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ ప్రార్ధించమని, వచ్చే 30 సంవత్సరాల వరకు తానే ముఖ్యమంత్రిగా ఉండాలని, చనిపోయిన తర్వాత తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలనే” ఆకాంక్షను జగన్ వ్యక్తపరుస్తూ చేసిన ప్రసంగం ఒక వైపు ఉండగా, తన ఉద్దేశం అధికారం కాదు, రాబోయే 25 ఏళ్ళు రాష్ట్రం కోసమే శ్రమిస్తాను అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం మరొక వైపు ఉంది.

దీంతో ఈ ఇద్దరి నేతల అభిలాషను వ్యక్తపరుస్తూ… జగన్ ఆలోచనలలో ఎంత అధికార దాహం ఉందో, అలాగే పవన్ భావాలలో ఎంత ఆదర్శప్రాయం ఉందో అన్న దానిని ఉదహరిస్తూ వేస్తున్న సెటైర్లు, కౌంటర్లకు కొదవలేదు. యధావిధిగా ఎవరి ఫ్యాన్స్ వారిని మెచ్చుకుంటుండగా… అధికార దాహం అనే అంశంలో మాత్రం జగన్ పై న్యూట్రల్ నెటిజన్ల పంచ్ లు తప్పడం లేదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?

A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…

6 hours ago

The Paradise Has Hype, But Is It Enough?

Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…

6 hours ago