షర్మిల కాంగ్రెస్‌లో చేరి వారికి మహోపకారమే చేస్తున్నారుగా!

మాట తప్పని… మడమ తిప్పనివారందరూ వైఎస్ కుటుంబంలోనే ఉన్నారు. కానీ వారు ఎన్నిసార్లు మాట తప్పారో…మడమ తిప్పారో వారి బాధితులకే తెలుసు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో తిరిగిన జగన్మోహన్‌ రెడ్డి విభజన ఖాయం అని తెలియగానే మడమ తిప్పి ‘సమైక్య ఏపీ’లోకి వచ్చేశారు. దాంతో తెలంగాణలో ఆయనను నమ్ముకొన్న వైసీపి నేతలు, ముఖ్యంగా ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు రోడ్డున పడ్డారు.

ఆ తర్వాత ‘జగనన్న సంధించిన బాణాన్ని నేనున్నాను కదా…’ అంటూ వైఎస్ షర్మిల వస్తే, తెలంగాణలో వైసీపి నేతలు ఆమెతో పాటు మూడేళ్ళు తిరిగారు. కానీ ఆమె కూడా మడమ తిప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడానికి సిద్దపడుతుండటంతో ఆమెను నమ్ముకొన్నవారు రోడ్డున పడ్డారు.

ADVERTISEMENT

కనుక వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వలన ఏపీలో ఆమె కోసం ఎదురుచూస్తున్నవారికి చాలా మహోపకారం చేసిన్నట్లే భావించవచ్చు. మున్ముందు ఎప్పుడైనా ఆమె మడమ తిప్పి మళ్ళీ తెలంగాణకు వెళిపోతానంటే వారికి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది.

ఒకవేళ తల్లి విజయమ్మ అన్నా చెల్లెళ్ళ మద్య రాజీ కుదిర్చి మళ్ళీ వారిని కలిపినా ఆమెతో పాటు వారందరూ కూడా వైసీపిలో చేరిపోవచ్చు. కనుక వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీలో రాజకీయ నాయకులు అందరికీ కూడా చాలా మేలు చేసిన్నట్లే భావించవచ్చు.

వైఎస్ షర్మిల ఈ నెల 4వ తేదీన ఢిల్లీ వెళ్ళి సోనియా, రాహుల్ గాంధీల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

బూతులు కూడా తిట్టారటగా.. సగం సగం చెప్తే ఎలా సాయి?

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల…

21 minutes ago

Dhurandhar Ruined Spy Universe: Is Karthi Next in Line?

Recently, the trailer of Karthi's most anticipated sequel Sardar 2 directed by PS Mithran, was…

28 minutes ago