
YS Sharmila health sparks debate
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల కడుపు నొప్పితో బాధ పడుతూ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేశారు.
ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని, ఇలాంటి సమయంలో తనకు అండగా నిలబడి తన ఆరోగ్యం కోసం ప్రార్ధించిన ప్రతీ ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలుపుకుంటూ సోషల్ మీడియాలో తన ఫోటో పెట్టారు.
ఇలాంటి సమయంలో మొట్ట మొదట స్పందించాల్సిన వ్యక్తి ఆమె అన్న జగన్మోహన్ రెడ్డి. ఆయన రాష్ట్రంలో ఎవరెవరినో వెళ్ళి పరామర్శిస్తూ ఉంటారు. కానీ సొంత చెల్లెలు ఆస్పత్రిలో ఉంటే పరామర్శించనే లేదు.
కానీ ఈ విషయం తెలిసి మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. “మీరు కోలుకుంటున్నారని తెలిసి సంతోషంగా ఉంది. త్వరగా కోలుకొని ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను,” అని ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో ఆడపిల్లలందరూ తన సొంత అక్క చెల్లెళ్ళే అన్నట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటారు. కానీ సొంత చెల్లి షర్మిలతో ఆస్తుల విషయంలో న్యాయపోరాటాలు చేస్తూ ఉంటారు. ఆస్తుల పంపకాలలో చాలా కుటుంబాలలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కనుక జగన్-షర్మిలల ఆస్తుల పంచాయితీ గురించి చర్చ అనవసరం.
కానీ ఇలాంటి సమయంలో ఆస్పత్రికి వెళ్ళి చెల్లిని పరామర్శించి ఉండి ఉంటే ఆమె కూడా సంతోషించేది. ప్రజలు కూడా హర్షించేవారు కదా?
India beat Afghanistan by 7 wickets in the second T20I in Delhi to take an…
With Rohith and Trigun emerging as the potential gamers in the Bigg Boss reality show,…