
జగన్ ఘోర ఓటమికి రామాయణంలో ఉడత పాత్ర పోషించారు జగన్ సోదరి వైస్ షర్మిల. సొంత కుటుంబమే జగన్ కు వ్యతిరేకంగా రాజకీయం మొదలుపెట్టడంతో జగన్ కు మరో రాజకీయ ఛాన్స్ ఇవ్వడానికి ఏపీ ఓటర్లు వెనకడుగు వేశారు.
తన పార్టీ కోసం పాదయాత్రలు చేసిన చెల్లిని, తల్లిని కూడా జగన్ పక్కన పెట్టడం, తన సొంత బాబాయ్ వివేకా కేసులో సునీత చేసిన న్యాయపోరాటానికి అడుగడుగునా ముళ్లకంచెలు వేయడం అన్ని జగన్ వ్యక్తత్వాని ప్రజల ముందునిచ్చింది.
అధికారాన్ని, పదవిని అడ్డుపెట్టుకుని బాబు, పవన్, లోకేష్ లతో పాటుగా సునీత , షర్మిలను కూడా టార్గెట్ చేసారు జగన్. చెల్లి షర్మిల కట్టుకునే చీర రంగు గురించి మొదలుపెడితే సునీత వ్యక్త పరిచే భావం వరకు అన్నిటికి పసుపు రంగు పూసి ‘పచ్చకామెర్ల వాడికి అన్ని పచ్చగా కనిపిస్తాయి’ అనే సామెతను రుజువు చేసారు జగన్.
జగన్ స్పందనకు అంతే స్థాయిలో సునీత, షర్మిల కూడా తమ ప్రతి స్పందనను తెలియచేస్తూ జగన్కు బాబు పిచ్చి పట్టిందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల ఫలితాల తరువాత మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చిన షర్మిల జగన్ మాదిరి కాకుండా చాల హుందాగా ప్రవర్తించారు.
ఈ ఎన్నికలలో “ఫర్ జగన్….ఎగైనెస్ట్ జగన్” అనే నినాదంతో ప్రజలు ఓట్లశారని, తానూ ఓడినప్పటికీ వైసీపీ ఓడిపోవాలని తానూ చేసిన పోరాటం నెగ్గిందన్నారు. వైసీపీ పార్టీ ఒక పిల్ల కాలువ లాంటిదని ఎప్పటికైనా అది కాంగ్రెస్ అనే మహా సముద్రంలో కలవాల్సిందే అంటూ పరోక్షంగా వైసీపీ కి కౌంటర్ వేశారు షర్మిల.
అలాగే గత ప్రభుత్వంలో తన బాబాయ్ వివేకా కేసులో ఎన్ని న్యాయపోరాటాలు చేసిన దక్కని న్యాయం ఈ ప్రభుత్వంలో దొరుకుతుందనే నమ్మకం బలంగా ఉందని పేర్కొన్నారు. షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలతో హే మళ్ళీ వేసేసిందిగా..! అంటూ మీమ్స్ మొదలయ్యాయి. అలాగే జగన్ కు మరోసారి షర్మిల చురకలు వేసినట్లయ్యింది.
జగన్ శత్రువులను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో షర్మిల ఆచితూచి అడుగు ముందుకేస్తున్నారనే చెప్పాలి. అందులో భాగంగానే జగన్ శత్రువులలో మొదటి వరుసలో ఉండే ఈనాడు సంస్థ అధినేత రామోజీ రావు కుటుంబ సభ్యులను కలిసి ఆయన చిత్ర పటానికి నివాళ్లర్పించారు షర్మిల. జగన్ ఘోర ఓటమితో రానున్న రోజులలో వైసీపీ కాళీ చేసిన ప్రతిపక్ష స్థానంలోకి కాంగ్రెస్ పార్టీని ఉంచాలని షర్మిల భావిస్తున్నట్టున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ముందువెనుక చూడకుండా జగన్ ను బండకేసి బాదినట్టు చాకిరేవేట్టిన షర్మిల ఇప్పుడు సహనంగా ఉంటారా.? మౌనం వహిస్తారా.? అంటే అనుమానమే. తానూ గెలవకపోయిన తన ప్రత్యర్థి ఓడారు అన్న ఆనందం షర్మిల ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. దీనితో చెల్లి మళ్ళొచ్చిందిరో..! జాగ్రత్త అంటూ జగనన్న అంటూ కౌంటర్లు పేలుతున్నాయి.
తన ఓటమిని కూడా హుందాగా ఒప్పుకుంటూ రాజకీయాలలో ఇవన్నీ సర్వ సహజం అనేలా షర్మిల వ్యాఖ్యలు కనిపిస్తే జగన్ మాత్రం తానూ వై నాట్ 175 అంటూ నినాదం ఇచ్చి కూటమి పార్టీకి 164 సీట్లు వస్తే ఈవీఎంల తప్పు, ప్రజల మోసం అంటూ అర్ధం పర్థం లేని ఆరోపణలు చేస్తూ ప్రజలలో తన పరువు తానే తీసుకుంటున్నారు జగన్.
Trolling has become a part of the film industry, especially in the age of social…
Mahesh Babu has spent years waiting for a project that can take him to the…