
తెలంగాణ ఎన్నికల బరిలో నిలబడుతుందా లేదా అన్న సందేహంలో ఉన్న తెలంగాణ వైస్సార్ పార్టీకి ఎన్నికల సంఘం ‘బైనోక్లర్’ గుర్తును కేటాయించింది. అసలు తెలంగాణాలో ఆ పార్టీ ఉనికి ఉందా లేదా అనేది షర్మిల అదే బైనోక్లర్ తో వెతికి చూసుకోవాల్సిన పరిస్థితే అంటున్నారు అక్కడి రాజకీయ నాయకులు.
తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీలు తమతమ ప్రచారంలో దూసుకుపోతుంటే షర్మిల మాత్రం తన పార్టీ తరుపున పోటీ చేయడానికి అభ్యర్థుల కోసం బైనోక్లర్ సాయంతో వెతుకుతున్నారనే చెప్పాలి. తెలంగాణాలో పాలేరు నియోజకవర్గం నుండి తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టాలని చూస్తున్న షర్మిలకు ఈ గుర్తు కలిసి వస్తుందా, రాదా?అనేది కాలమే చెప్పాలి.
మొత్తానికి తన పార్టీకి తగ్గ గుర్తింపు తెచ్చుకోవడంలో మాత్రం ఎన్నికల సంఘం వారికి షర్మిల రుణపడి ఉండాల్సిందే అంటూ వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు తెలంగాణ రాజకీయ పార్టీల నేతలు.ఈ గుర్తు పై షర్మిల ఎందరిని నిలబెడుతుందో ఎందరిని గెలిపించుకుంటుందో తన పై తన పార్టీ పై తన పార్టీ గుర్తు పై చేసిన విమర్శలకు షర్మిల ఎలా బదులిస్తుందో వేచి చూడాలి.
Ranabaali is the second collaboration between Vijay Deverakonda and director Rahul Sankrityan. Stay tuned for…
Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…